
ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో పోలీసుల హడావిడి
కడప: ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో శనివారం నెల్లూరు పోలీసుల హడావిడి చేశారు. నెల్లూరు జిల్లా జెడ్పీటీసీలు ఉన్నారంటూ పోలీసులు తనిఖీలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించిన పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా సమావేశం జరుగుతుంటే కావాలనే పోలీసులు హడావిడి చేస్తున్నారని జెడ్పీటీసీలు ఆరోపించారు.