
సాక్షి, నెల్లూరు : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నెల్లూరు జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు నేతలు రఘురామి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇతర పార్టీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్, మాజీ ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఇలా పార్టీ వీడటంతో నెల్లూరు జిల్లా టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment