సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్త కాన్వాయ్ అందుబాటులోకి వచ్చింది. ఆరు ఫార్చూనర్, రెండు ప్రాడో వాహనాలతో సీఎం చంద్రబాబుకు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కొత్త కాన్వాయ్ సమకూర్చింది. సఫారీ వాహనాలతో ఉన్న కాన్వాయ్ తరచూ మరమ్మత్తులకు గురి కావడంతో కొత్త వాహన శ్రేణిని సమకూర్చినట్లు జీఏడీ పేర్కొంది.
కొత్త కాన్వాయ్‌తో చంద్రబాబు గురువారం సచివాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా సమకూర్చిన వాహనా శ్రేణికి రూ. 5.56 కోట్లు వెచ్చించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుకు కాన్వాయ్‌లు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో ఉండే కాన్వాయ్‌కు రూ. 3.07 కోట్లు ఖర్చు చేశారు. తిరుపతిలో కూడా ఓ కాన్వాయ్ ఏర్పాటు చేయనున్నారు.
వీఐపీ కాన్వాయ్‌లకు స్వస్తి చెప్పండి:బాబు
రాజధాని భూ సమీకరణ, నిర్మాణ సంబంధిత వ్యవహారాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే సమీక్షలు, సమావేశాల కోసం విజయవాడకు వచ్చే ప్రముఖుల కోసం డీలక్స్ బస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నిఘా విభాగం అధిపతి ఏఆర్ అనురాధను ఆదేశించారు.
గుర్తుండేలా పుష్కరాలు
ప్రజలు కలకాలం గుర్తు పెట్టుకునేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పుష్కరాల నిర్వహణపై 38 శాఖలతో గురువారం ఆయన సమీక్షించారు. పుష్కరాల తొలి, చివరి రోజుల ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తామన్నారు.
సీఎంకు కొత్త కాన్వాయ్
Published Fri, Jan 9 2015 1:45 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement