'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్' | New railway zone for Andhra Pradesh, says Venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్'

Published Sun, Jun 15 2014 12:19 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్' - Sakshi

'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్'

భారతదేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాకిరణం లాంటి వారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఆదివారం విశాఖపట్నంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ... కేంద్రంలో ఇంకా సీట్లు సర్ధుబాటు జరగలేదని... అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయిని ఆయన ఆరోపించారు. 100 ఏళ్లకుపైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీ దేశానికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పర్యావరణం, అభివృద్ధిల మధ్య సమతుల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు.

 

సీఆర్జెడ్ ఏర్పాటుపై సమీక్షలు జరపాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టిందని వెంకయ్యనాయుడు వివరించారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement