ఆయకట్టుకు ‘సాగర్’ నీటి విడుదల | nijansagar.release of water | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు ‘సాగర్’ నీటి విడుదల

Published Thu, Sep 5 2013 4:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

nijansagar.release of water

నిజాంసాగర్, న్యూస్‌లైన్ :ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం బుధవారం నిజాంసాగర్  ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. పదిహేను రోజల పాటు ప్రధాన కాలువ ద్వారా రెండు టీఎంసీల నీటిని పంటలకు అందించనున్నట్లు జిల్లా నీటిపారుదలశాఖ ఈఈ సత్యశీలారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన కాలువకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన  మాట్లాడారు. ప్రధాన కాలువ  పరిధిలో డిస్ట్రిబ్యూటరీ 50 వరకు లక్షా 37 వేల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం సాగునీరు అత్యవసరం కావడంతో నీరందిస్తున్నామన్నారు.
 
 మొదటి డిస్ట్రిబ్యూటరీ నుంచి 50వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగ వుతున్న పంటల కోసం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్ర స్తుతం ప్రధాన కాలువకు 12వందల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆయకట్టు అవసరాలకు డిమాండ్ మేర నీటిని విడుదలను పెంచుతామన్నారు. ఆయకట్టు కింద 80 శాతం వరి, 10 శాతం చెరుకు, 10 శాతం ఆరుతడి పంటలను సాగు చేస్తున్నట్లు వివరించారు. నిజాంసాగర్ మండలంలో ప్రధాన కాలువ కింద నాలుగు వేల ఎకరాలు, బాన్సువాడలో 10,500 ఎకరాల్లో, బీర్కూర్‌లో 6,500 ఎకరాల్లో, కోటగిరి 28 వేల ఎకరాాల్లో, వర్ని 16,500 ఎకరాల్లో, బోధన్ 11 వేల ఎకరాల్లో, ఎడపల్లిలో 9,500 ఎకరాల్లో, రెంజల్11 వేల ఎకరాల్లో, నవీపేట మండలంలో 14 వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తు న్నారని ఆయన వివరించారు.
 
 జలవిద్యుదుత్పత్తి ప్రారంభం...
 నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తుండటంతో హెడ్‌స్లూయిస్ వద్ద జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. విద్యుదుత్పత్తి కేంద్రంలోని రెండో టర్బయిన్‌ద్వారా 1.86 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్‌కో ఏడీ శ్రీకాంత్ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement