విజయనగరం ఫోర్ట్: ప్రైవేటు ఆస్పత్రులు ధనార్జనే తప్ప.. రోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల్లో రోగులకు భద్రత కొరవడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే నివారణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన నివారణ పరికరాలు అత్యధిక ఆస్పత్రుల్లో లేవు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అగ్ని ప్రమాదం జరిగితే రోగులు ప్రాణాలు గాల్లో కలిసేపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 200 వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో 20 నుంచి 30 ఆస్పత్రులకు మాత్రమే అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఉన్నాయి. బహుళ అంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులైన కేంద్రాస్పత్రి, ఘోషా, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో కూడా అగ్నిప్రమాద నివారణ పరికరాలు లేవు. ప్రతి ఆస్పత్రిలోనూ బహుళ అంతస్తులన్నింటికీ.. ఫైర్ సేఫ్టీ అక్విప్‌మెంట్ ఉండాలి. అదే విధంగా ఫైర్ బకెట్‌లు, డ్రమ్ముల్లో నీరు ఉండాలి. అగ్నిమాపక శకటం ఆస్పత్రి చుట్టూ తిరగడానికి అవసరమైన స్థలం ఉండాలి. కానీ 90 శాతం ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు. 20 నుంచి 30 ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఉన్నప్పటికీ.. అగ్నిమాపక శకటం తిరగడానికి అవసరమైన ఖాళీ స్థలం మాత్రం లేదు.
అగ్నిప్రమాదం జరిగితే లోపలే ఊపిరి వదిలేయాలి తప్ప.. బయట పడే మార్గం ఏ ఆస్పత్రిలోనూ లేదు.
నోటీసులిచ్చి చేతులు దులుపుకొన్నారు..గత ఏడాది వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరు, ఇద్దరు తప్ప వీటిని.. మిగతా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు కూడా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు తప్ప రోగుల ప్రాణాలు గురించి పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలు నిల్!
Published Mon, Sep 7 2015 12:14 AM | Last Updated on Wed, Sep 5 2018 9:52 PM
Advertisement
Advertisement