ఏక్రగీవంగా రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఎంపిక
ఏక్రగీవంగా రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఎంపిక
Published Tue, Jun 24 2014 3:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
హైదరాబాద్: కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం నామినేషన్లకు చివరి రోజు కాగా, ఏపార్టీ నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవడం నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్ధన్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యురాలు కాకుండానే కేంద్రమంత్రిగా భాద్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీకి దింపింది.
బీజేపీ సభ్యురాలు నిర్మలా సీతారామన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం మద్దతు తెలిపింది. వాస్తవానికి ఎన్నిక జూలై 3 తేదిన జరగాల్సి ఉండగా.. ఈ స్థానానికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
Advertisement