వరంగల్: ఇంజనీరింగ్ కళాశాలల్లోను, ఉన్నత విద్యా సంస్థల్లోను సాధారణంగా విద్యార్థులపై సాటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడటం చూస్తుంటాం. అయితే, వరంగల్ లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... నిట్లో అందుకు భిన్నంగా ఏకంగా లెక్చరర్నే అక్కడి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు!!
దీంతో నిట్ యాజమాన్యం కూడా ఘాటుగానే స్పందించింది. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులను ఏడాది పాటు కాలేజి నుంచి సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ బాధితుడు, బాధ్యులు మొత్తం అందరూ విశాఖపట్నానికి చెందిన వారే కావడం గమనార్హం. మొదట్లో ఆర్ఏసీ వరంగల్గా ప్రసిద్ధి చెంది, తర్వాత నిట్గా మారిన ఈ విద్యాసంస్థలో ఏకంగా లెక్చరర్ను విద్యార్థులు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నిట్లో లెక్చరర్ పైనే ర్యాగింగ్
Published Tue, Jan 28 2014 6:28 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement