తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఏర్పాటుకు ఈనెల 20న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 20న ఉదయం 8.30లకు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు.