సాక్షి, ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సున్నాగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం 63 కేసులు నమోదైతే నేటితో మొత్తం బాధితులు డిశ్చార్జ్ అయినట్లు అయింది. పూర్తి పాజిటివ్ కేసులు డిశ్చార్జి కాబడి, కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాగా ఏపీలో ప్రకాశం జిల్లా రికార్డులకెక్కింది. జిల్లాలో 20 వేలకు పైగా శాంపిల్ సేకరిస్తే దాదాపు 19 వేలకు పైగా కరోన నెగెటివ్‌గా తేలింది. 63 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మరో వెయ్యి కేసుల వరకు ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వైద్య బృందం ,యంత్రాంగం కృషి ఫలితంగానే ప్రకాశం జిల్లా కరోన కట్టడిలో ముందుందని రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు .ప్రస్తుతానికి జిల్లాలో కొత్త కేసులు లేనప్పటికి ఏమరుపాటుగా ఉంటే పెను ప్రమాదమేనని తెలిపారు. చదవండి: మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..!
అయితే ప్రస్తుతం కోయంబేడు, మద్రాస్ ఇలా ఇతర ప్రాంతాల నుంచి భారీఎత్తున వలస కార్మికులు జిల్లాకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని జిల్లా అధికారులు క్వారంటైన్‌కు తరలించి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించిన అనంతరం వారిని నివాసాలకు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: ప్రియురాలి కోసం.. కుటుంబాన్ని హతమార్చాడు
Comments
Please login to add a commentAdd a comment