టీడీపీతో విభేదాలు వద్దు:వెంకయ్యనాయుడు | No differences with TDP : Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీతో విభేదాలు వద్దు:వెంకయ్యనాయుడు

Published Sun, Nov 30 2014 3:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వెంకయ్య నాయుడు - Sakshi

వెంకయ్య నాయుడు

విజయవాడ: రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంకాదని, అధికారపక్షమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. టీడీపీతో విభేదాలు పెట్టుకోవద్దని ఆయన బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాజధానిపై రాజకీయ విభేదాలు సృష్టించవద్దన్నారు. రాజధానిని స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రాజధాని నిర్మాణం ఉంటుదన్నారు. ఇదే విషయంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు దృష్టిపెట్టారని చెప్పారు. రైతుల భూములు తీసుకుంటే వారి జీవితాలకు భరోసా ఇవ్వలన్నారు. పచ్చటి పొలాలు పోవడం బాధాకరం అన్నారు. రాజధాని నిర్మిణానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు నెలల్లో ప్రపంచ నాయకుడుగా ఎదిగారన్నారు. దేశంలో కాంగ్రెస్ శకం ముగిసిందని చెప్పారు. ఆ పార్టీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వెంకయ్యనాయుడు విమర్శించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement