ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : భావి ప్రధాని నరేంద్రమోడీయేనని, దీనిని ఏ శక్తులూ అడ్డుకోలేవని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జీలు అయ్యనగారి భూమయ్య, ము రళీధర్‌గౌడ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయం లో బీజేపీ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకున్నా బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌పై ఎటువంటి మెలిక పెట్టినా బీజేపీ దానికి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఏ సర్వేల్లో చూసిన మోడీ ప్రభంజనమే కనిపిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్‌చార్జి జనగం సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నివేధిత వఝే, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఉమాఉత్తర్‌వార్, నాయకులు తుల రఘుపతి, గన్నోజి విజయ్‌కుమార్, మడావి రాజు, దినేశ్ మటోలియా, జోగు రవి, ఆయా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
మోడీ నాయకత్వంలో ముందుకెళ్తాం..
గుడిహత్నూర్ : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్, జిల్లా అధ్యక్షుడు ఏ.భూమయ్య అన్నారు. మండల కేంద్రంలోని శివకల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. నేడు దేశంలో అవినీతి, పేదరికం, అధిక ధరలు, రైతుల ఆత్మహత్యలు రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అధిగమించి సుపరిపాలన అందించడం కేవలం బీజేపీకే సాధ్యపడుతుందని చెప్పారు. జిల్లాలో లక్షా 50వేల ఎకరాల్లో సోయా, పత్తి పంటలు అతివృష్టితో నాశనం అయ్యూయని భూమయ్య పేర్కొన్నారు. అరుునా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మనస్తాపం చెంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. జిల్లా రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మచ్చాపూర్‌కు చెందిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పండిత్, అరవింద్ పవార్, మడావి లేతీరాం బీజేపీలో చేరారు. జిల్లా నాయకులు మడావి రాజు, డా.కేంద్రే లక్ష్మణ్, నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవ్‌రావ్ ఆమ్టే, కిసాన్ మోర్చా, గిరిజన మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కిష్టారెడ్డి, జైవంత్‌రావ్, మండల అధ్యక్షులు సింధే పరమేశ్వర్, నీలకంఠ్ అప్పా పాల్గొన్నారు.
‘మోడీని ఏ శక్తులూ అడ్డుకోలేవు’
Published Sun, Sep 22 2013 4:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement