వీహెచ్ కు చేదు అనుభవం
హైదరాబాద్: గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా వేదికపైకి పంపడానికి పోలీసులు నిరాకరించారు.
ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్ కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ కు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకున్నారు.