V.Hanumanta Rao
-
హోదా కావాలంటే మద్దతు ఉపసంహరించుకో
- చంద్రబాబుకు వీహెచ్ సలహా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలని, ప్రధానమంత్రికి తూతూ మంత్రంగా లేఖ రాస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రత్యేక హోదా దానంతటదే వస్తుందన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదించిందని, అదే విధంగా తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు చాలా మాట్లాడారని, అతనిప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ట్విట్టర్లో కూతలు కూసే పవన్‌కల్యాణ్ కాంగ్రెస్‌పై అనవసర కామెంట్లు చేయడం మానుకుంటే అతనికే మంచిదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయంగా పలుచన కావొద్దని హితవు చెప్పారు. -
మనసు పెట్టి రాస్తే జీవకళ! మెదడు పెట్టి రాస్తే సమగ్రత!!
అంతర్వీక్షణం వి. హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్... అంటే ఆయన సంతోషిస్తారు. ప్రొఫెసర్ హనుమంతరావు, ఆర్థికవేత్త హనుమంతరావు అనే మకుటాలు నాకొద్దంటూ నిక్కచ్చిగా చెప్పేస్తారు. గడచిన ఆగస్టు 30వ తేదీతో 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టారాయన. ఆయన జర్నలిస్టు జీవితానికి అరవై దాటాయి. ఈ సందర్భంగా ఇది ఆయన అంతర్వీక్షణం. పాత్రికేయ వృత్తి గురించి ఒక్కమాటలో..! అత్యంత బాధ్యతాయుతమైనది, పవిత్రమైనది. మీ రోజుల్లో శిక్షణ ఉండేదా? అప్పట్లో జర్నలిజం కోర్సుల్లేవు. ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, టైపింగ్, షార్ట్‌హ్యాండ్ అర్హతలతో ఈ వృత్తిలోకి వచ్చాను. ఓనమాల నుంచి పనిచేస్తూనే నేర్చుకున్నాను. తప్పులు చేస్తూ... సీనియర్లు దిద్దిన కాపీ చూసి నేర్చుకున్న తరం మాది. మీ తొలి ఉద్యోగం... పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్. మరి పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? ప్రజాశక్తిలో పుచ్చలపల్లి సుందరయ్యకు సహాయకుడిగా టైప్, షార్ట్ హ్యాండ్ వచ్చిన వ్యక్తి కావాలని స్నేహితులు చెప్పడంతో చేరాను. ఆ తర్వాత పార్లమెంటు కార్యకలాపాలను నోట్స్ రాసుకుని కథనాలు తయారు చేయడానికి షార్ట్ హ్యాండ్ వచ్చు అనే అర్హతతోనే నన్ను ఢిల్లీకి పంపారు. అప్పట్లో పత్రికల మధ్య అక్షరయుద్ధం సాగేదా? 1955 మధ్యంతర ఎన్నికల సమయంలో ఆంధ్రప్రభ (నార్ల వెంకటేశ్వరరావు) - విశాలాంధ్ర (రాంభట్ల కృష్ణమూర్తి) పత్రికల మధ్య కార్టూన్ల యుద్ధం తీవ్రంగా సాగింది. పాత్రికేయునిగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? యుఎన్‌ఐలో పనిచేస్తున్నప్పుడు మాకు పిటిఐతో పోటీ. జాతీయపత్రికల్లో హైదరాబాద్ కనిపించాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే వార్తాకథనాలు రాయాలి. రాజేంద్రనగర్, తార్నాకల్లోని అఖిలభారత సైన్సు, సాంకేతిక సంస్థల్లో నాకు మంచి విషయాలు దొరికేవి. మీరు కాలరెగరేసుకుని చెప్పగలిగిన రిపోర్టింగ్? బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో విమాన వాహక నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’ నుంచి యుద్ధవార్తలు పంపడం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కడినే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇరవై వరకు ఉంటాయి. ‘ఎపి యట్ 50’ ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమీక్ష సమాచారంతో ఇంగ్లిష్‌లో ప్రచురించిన తొలి పుస్తకానికి సంపాదకత్వం వహించాను. నేను స్థాపించిన డిఎన్ఎఫ్ (డేటా న్యూస్ ఫీచర్స్) అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి న్యూస్ ఏజెన్సీ. విలేఖరిగా మీరు ఊహించని హఠాత్పరిణామం ఏదైనా ఉందా? విశాఖపట్నంలో జరిగింది. పాకిస్తాన్ సబ్‌మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయింది. పాక్ జలాంతర్గామిని పేల్చివేసిన శబ్దాన్ని విశాఖ నగరం మొత్తం విన్నది. వైస్ అడ్మిరల్ ఆ విషయాన్ని పత్రికాసమావేశంలో వెల్లడించి మేమున్న గది తలుపులు వేయించాడు. ఎందుకలా!... పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వార్తను ప్రభుత్వం ప్రకటించకముందు పత్రికల్లో రాకూడదని. వ్యక్తికి - విలేఖరికి తేడా!... వ్యక్తి తప్పు చేస్తే దాని దుష్ర్పభావాన్ని వారు మాత్రమే భరిస్తారు. జర్నలిస్టు తప్పు రాస్తే ఒక వాస్తవం మరుగున పడి, అవాస్తవం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. జర్నలిజానికి కేంద్రబిందువు రాజకీయాలేనా? కాదు, ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా సాగే వార్తలకు, వార్తా కథనాలకు కట్టుబడి ఉండడమే విలేఖరి తనకు తాను గీసుకోవాల్సిన లక్ష్మణరేఖ. జర్నలిస్టుకు మీరిచ్చే సందేశం? ఈ వృత్తిలో కొనసాగుతున్నది జీతం కోసమే, అయినా ‘మనసు పెట్టి పని చేస్తే రాష్ట్రానికీ, దేశానికీ, ప్రజలకు సేవ చేయవచ్చు’ అనే తలంపు ఉండాలి. అప్పుడే వార్తకు జీవకళ వస్తుంది. మెదడుకు పని చెప్పి మేధస్సు జోడిస్తే వార్తకు సమగ్రత వస్తుంది. - వాకా మంజులారెడ్డి -
టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడు!
అధిష్టానం పొన్నాలను తొలగించనుంది: వీహెచ్ కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు ఉండాలని వ్యాఖ్య మండిపడ్డ పొన్నాల.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణ పీసీసీలో సీనియర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీని ప్రక్షాళన చేసేదిశగా టీపీసీసీ చీఫ్‌ను అధిష్టానం తప్పించనుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు పేర్కొనగా... పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సీనియర్లనైనా వదిలిపెట్టబోమంటూ పొన్నాల తీవ్రంగా స్పందించారు. శనివారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అనంతరం వీహెచ్ మాట్లాడగా.. అనంతరం పొన్నాల గాంధీభవన్‌లో వీహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వీహెచ్ శనివారం ఉదయం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుని మార్పు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని ఆయన చెప్పారు. అందులో భాగంగా పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు అవసరం ఉందన్నారు. ఈ సారి టీపీసీసీ అధ్యక్షుని నియామకం ఢిల్లీలో జరగకూడదని... పార్టీ పెద్దలు రెండ్రోజులపాటు రాష్ట్రంలో మకాం వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నియమించాలని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ మీరొద్దు.. వీహెచ్ వ్యాఖ్యలపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా తనకు సన్నిహితులేనని, పార్టీకి ఉపయోగపడే సూచనలు చేస్తామంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వీహెచ్‌లాంటి వ్యక్తులకు తన స్థాయి తక్కువనుకుంటే హైకమాండ్ పెద్దలను కలసి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు. -
అదో రుణానందలహరి
రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉంది. కాబట్టి నెట్టుకొస్తాడని కొందరి భావన. ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలోనే, చెల్లించడంలోనే ఆయనకు అపార అనుభవం ఉంది. రుణ మాఫీ హామీ సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తల తినేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్‌ది కూడా ఇదే పరిస్థితి. ‘మీరిచ్చిన వాగ్దా నాలను నెరవేర్చండి!’ అని రైతులు ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానిని దేబరిస్తున్నారు. మామూలుగా జరిగేదేమి టంటే, సహకార సంఘాల దగ్గర రుణాలు తీసుకుని, వాటిని చెల్లించని పక్షంలో అకౌంట్ పుస్తకాలలో ఆ అప్పు తీర్చేసినట్టు, అదే మొత్తాన్ని తిరిగి రుణంగా ఇచ్చినట్టు సర్దుబాటు చేసుకుంటారు. కానీ ఈ రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్నవి. కాబట్టి ఆ పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రధాని ద్వారా రిజర్వు బ్యాంకు మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకార బ్యాంకులు అనుసరించే పద్ధతిలోనే రుణం చెల్లింపు చేయించ గలిగినా; ఖరీఫ్ పంటకు రుణం లభించదు. ఇంతకీ ఈ రుణమాఫీ వాగ్దానం బ్యాంకులు ఇచ్చిన రుణాలకే వర్తిస్తుందా? స్థానిక భూకామందుల నుంచి తీసుకున్న వాటికి కూడా వర్తిస్తుందా? ముఖ్యమంత్రులూ! ఈ రుణాలు కూడా మాఫీ అవుతాయా? రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉన్నది కాబట్టి ఏదో విధంగా నెట్టుకొస్తాడని కొంత మంది భావన. ఆయన పాలనలో ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలో, చెల్లించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఉదాహరణకి 1999-2000 నుంచి 2003-2004 వరకు రుణాల రాకపోకల గణాంకాల పట్టికను పరిశీలిద్దాం. తెచ్చిన అప్పులో సింహభాగం వడ్డీలు, అసలులో కొంత భాగం తిరిగి చెల్లించిన పరిస్థితి. ఆయన పరిపాలనానుభవం ఇదన్నమాట. ఆయన గత పాలనలో ఏం జరిగిందో చాలామంది మరచిపోయి ఉండొచ్చు. కానీ జర్నలిస్టులు ఆ పని చేయలేరు. ఆ సమాచారాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటాను. అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నది అప్పట్లో ఆయన నోటి నుంచి రాలిన ఆణిముత్యాలలో ఒకటి. మామూలుగా ప్రభుత్వాలు చేసే పనేమిటంటే- 1. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే అప్పు తెచ్చి ఆ లోటును పూడ్చడం. 2. బడ్జెట్లో చేసిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయక పోవడం. 2003-04లో అందుకోలేకపోయిన ద్రవ్య లక్ష్యాలను ఈ పట్టికలో గమనించవచ్చు. లోటు ఏటా పెరుగుతూనే వచ్చింది. 1999-2000 రెవెన్యూ లోటు రూ. 1233 కోట్లు ఉండగా అది 2003-04 సంవత్సరానికి రూ. 3771 కోట్లకు పెరిగింది. అదే కాలంలో ద్రవ్య లోటు రూ. 4976 కోట్ల నుంచి రూ. 7450 కోట్లకు చేరింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నివేదిక నుంచి తీసుకున్నవే. చంద్రబాబే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా నిధులు మంజూరు చేస్తాయికానీ పూర్తి ఖచ్చు చేయవు. చేసినా లక్ష్యాలు నెరవేరవు. ఫలితాలు అందవలసిన వారికి అందవు. ప్రతి బడ్జెట్ బాగోతం ఇంతే. కాగ్ నివేదిక ప్రకారమే ‘అప్పు తెచ్చిన డబ్బులో సగానికి సగం రోజువారీ ఖర్చుల కోసమే వినియోగమైంది.’ ఈ గణాంకాలన్నీ మొత్తం బడ్జెట్‌కు సంబంధించినవి. వివరాలలోకి పోయి చూస్తే సామాజిక సేవల రంగాలలో దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థానంలో ఉందో ఈ పట్టిక చెబుతుంది. (సెస్ డెరైక్టర్ మహేంద్రదేవ్, ఫ్యాకల్టీ సభ్యురాలు శ్రీదేవి రచించిన పత్రం ఆధారంగా)ఈ సంక్షేమ పథకాల్లో వైద్య రంగాన్ని తీసుకొని చుద్దాం. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో 1,389 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే నాలుగేళ్ల తర్వాత కూడా అన్నే ఉన్నాయి. ఈ కేంద్రాలలో డాక్టర్లు, నర్సులు, సరిపడా మందులున్నాయా అనే ప్రశ్నకు జవాబు నా కన్నా మీకే బాగా తెలుసు. అలాగే డిస్పెన్సరీలు, పడకలు, టీబీ ఆసుపత్రుల సంఖ్య నెత్తిన మేకు కొట్టేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన వాటికన్నా 2.6 శాతం తక్కువ ఉన్నాయని కాగ్ మొట్టికాయ వేసింది. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబు ఖాతాలోనే వెయ్యాలి. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు హైదరాబాద్ ఒక ముఖం అయితే, మిగతా జిల్లాలు, గ్రామాలు మరొక ముఖం. ఆ ముఖాన్ని 2001 జనాభా లెక్కలు చూపించాయి. రాష్ట్రంలో కోటీ అరవైఎనిమిది లక్షల ఏభై వేల కుటుంబాలుంటే వారిలో 1.22 కోట్ల కుటుంబాలు ఇంకా పిడకలు, బొగ్గు, కట్టెపుల్లల మీదే వంటావార్పు చేసుకొంటున్నారు. 1.12 కోటి మందికి పొలాలు, పొలంగట్లు, రైలుపట్టాలే మరుగుదొడ్లు. సగం కుటుంబాలకు ఎలాంటి మురుగునీటి సౌకర్యం లేదు. అయితే ఇదంతా చంద్రబాబు హయాంలో జరిగిందనడం లేదు. అంతకు ముందు నాలుగు దశాబ్దాలుగా పాలించిన వారి వాటా కూడా ఉంది. పేదరికం గ్రామాల్లో 11 శాతానికి పడిపోయిందని లెక్కలు చెప్పిన చంద్రబాబు, తన హయాంలో కూడా ఎంత తగ్గిందో చెబితే బావుండేది. చంద్రబాబు పరిపాలన ప్రారంభించిన సంవత్సరంలో రాష్ట్రం అసలు, వడ్డీ చెల్లింపులు సగటున రోజుకు కోటి రూపాయలు. ఈ సగటు 2005-06 ఆఖరు నాటికి సుమారు 22 కోట్లు. రోజుకు 24 గంటలు కాబట్టి ఉజ్జాయింపుగా సగటున గంటకు కోటి రూపాయలు. అంటే 95-96లో రోజుకు ఒక కోటి రూపాయలైతే, 2005-06 నాటికి గంటకు కోటి రూపాయలు! ఎంత అభివృద్ధో! అప్పుడాయన అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదంటూ రాష్ట్రం ఆర్థికంగా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చారు. ఇప్పుడు కూడా శ్వేత పత్రాల విడుదల ప్రారంభించారు. చరిత్ర పునరావృతమవుతుందా? (వ్యాసకర్త ఆర్థిక విశ్లేకులు) వి. హనుమంత రావు -
వీహెచ్ కు చేదు అనుభవం
హైదరాబాద్: గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా వేదికపైకి పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్ కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ కు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు: వీహెచ్
హైదరాబాద్: తిరుమలలో తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. తిరుపతిలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల పంపిణీ ఉంటుందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాలనుకుంటే రాజీనామా చేసి ఉండొచ్చునన్నారు. తనవైపు నుంచి తప్పు జరిగితే క్షమాపణ చెబుతానన్నారు. భావోద్వేగాలు ఉన్నందున మీడియా సంయమనం పాటించాలని వీహెచ్ కోరారు. తిరుమలలో కూడా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. దీంతో ఆగ్రహాం చెందిన సమైక్యవాదులు ఆలిపిరి వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు విహెచ్పై కేసు కూడా నమోదు చేశారు. -
వీహెచ్‌కి సికె బాబు హెచ్చరిక
చిత్తూరు: రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తిరుమలకు వచ్చింది దైవ దర్శనానికా? లేక చిచ్చులు పెట్టడానికా? అని ఎమ్మెల్యే సీకే బాబు మండిపడ్డారు. తిరుమలలో చేసిన వ్యాక్యలు తిరిగి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ విహెచ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చునని, అయితే ఉద్యోగాలు చేయరాదని ఆయన అన్నారు. దాంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు విహెచ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు భారీ భద్రత నడుమ వీహెచ్‌ను రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. -
దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్
హైదరాబాద్ : అలిపిరిలో కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు వాహనంపై సమైక్యవాదులు చెప్పులు, రాళ్లు విసరటాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. తెలంగాణ వాదులపై దాడి చేస్తే ఎలా కలిసి ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. రాళ్లు, చెప్పులు విసరటం సమైక్యవాదమా అని ఆయన అన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులకు ఉద్యోగ సంఘాలు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని, దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవాద్దని హరీష్ రావు హెచ్చరించారు.