అదో రుణానందలహరి | Loan Waiver is possible? | Sakshi
Sakshi News home page

అదో రుణానందలహరి

Published Wed, Jul 16 2014 11:42 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

అదో రుణానందలహరి - Sakshi

అదో రుణానందలహరి

రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉంది. కాబట్టి నెట్టుకొస్తాడని కొందరి భావన. ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలోనే, చెల్లించడంలోనే ఆయనకు అపార అనుభవం ఉంది.
 
రుణ మాఫీ హామీ సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తల తినేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్‌ది కూడా ఇదే పరిస్థితి. ‘మీరిచ్చిన వాగ్దా నాలను నెరవేర్చండి!’ అని రైతులు ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానిని దేబరిస్తున్నారు. మామూలుగా జరిగేదేమి టంటే, సహకార సంఘాల దగ్గర రుణాలు తీసుకుని, వాటిని చెల్లించని పక్షంలో అకౌంట్ పుస్తకాలలో ఆ అప్పు తీర్చేసినట్టు, అదే మొత్తాన్ని తిరిగి రుణంగా ఇచ్చినట్టు సర్దుబాటు చేసుకుంటారు. కానీ ఈ రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్నవి. కాబట్టి ఆ పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రధాని ద్వారా రిజర్వు బ్యాంకు మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకార బ్యాంకులు అనుసరించే పద్ధతిలోనే రుణం చెల్లింపు చేయించ గలిగినా; ఖరీఫ్ పంటకు రుణం లభించదు.

ఇంతకీ ఈ రుణమాఫీ వాగ్దానం బ్యాంకులు ఇచ్చిన రుణాలకే వర్తిస్తుందా? స్థానిక భూకామందుల నుంచి తీసుకున్న వాటికి కూడా వర్తిస్తుందా? ముఖ్యమంత్రులూ! ఈ రుణాలు కూడా మాఫీ అవుతాయా? రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉన్నది కాబట్టి ఏదో విధంగా నెట్టుకొస్తాడని కొంత మంది భావన. ఆయన పాలనలో ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలో, చెల్లించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఉదాహరణకి 1999-2000 నుంచి 2003-2004 వరకు రుణాల రాకపోకల గణాంకాల పట్టికను పరిశీలిద్దాం.
http://img.sakshi.net/images/cms/2014-07/41405536324_Unknown.jpg

తెచ్చిన అప్పులో సింహభాగం వడ్డీలు, అసలులో కొంత భాగం తిరిగి చెల్లించిన పరిస్థితి. ఆయన పరిపాలనానుభవం ఇదన్నమాట. ఆయన గత పాలనలో ఏం జరిగిందో చాలామంది మరచిపోయి ఉండొచ్చు. కానీ జర్నలిస్టులు ఆ పని చేయలేరు. ఆ సమాచారాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటాను. అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నది అప్పట్లో ఆయన నోటి నుంచి రాలిన ఆణిముత్యాలలో ఒకటి. మామూలుగా ప్రభుత్వాలు చేసే పనేమిటంటే- 1. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే అప్పు తెచ్చి ఆ లోటును పూడ్చడం. 2. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయక పోవడం. 2003-04లో అందుకోలేకపోయిన ద్రవ్య లక్ష్యాలను ఈ పట్టికలో గమనించవచ్చు.http://img.sakshi.net/images/cms/2014-07/81405536406_Unknown.jpg


లోటు ఏటా పెరుగుతూనే వచ్చింది. 1999-2000  రెవెన్యూ లోటు రూ. 1233 కోట్లు ఉండగా అది 2003-04 సంవత్సరానికి రూ. 3771 కోట్లకు పెరిగింది. అదే కాలంలో ద్రవ్య లోటు రూ. 4976 కోట్ల నుంచి రూ. 7450 కోట్లకు చేరింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నివేదిక నుంచి తీసుకున్నవే. చంద్రబాబే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా నిధులు మంజూరు చేస్తాయికానీ పూర్తి ఖచ్చు చేయవు. చేసినా లక్ష్యాలు నెరవేరవు. ఫలితాలు అందవలసిన వారికి అందవు. ప్రతి బడ్జెట్ బాగోతం ఇంతే. కాగ్ నివేదిక ప్రకారమే ‘అప్పు తెచ్చిన డబ్బులో సగానికి సగం రోజువారీ ఖర్చుల కోసమే వినియోగమైంది.’

ఈ గణాంకాలన్నీ మొత్తం బడ్జెట్‌కు సంబంధించినవి. వివరాలలోకి పోయి చూస్తే సామాజిక సేవల రంగాలలో దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థానంలో ఉందో ఈ పట్టిక చెబుతుంది.
http://img.sakshi.net/images/cms/2014-07/81405536579_Unknown.jpg


(సెస్ డెరైక్టర్ మహేంద్రదేవ్, ఫ్యాకల్టీ సభ్యురాలు శ్రీదేవి రచించిన పత్రం ఆధారంగా)ఈ సంక్షేమ పథకాల్లో వైద్య రంగాన్ని  తీసుకొని చుద్దాం. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో 1,389 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే నాలుగేళ్ల తర్వాత కూడా అన్నే ఉన్నాయి. ఈ కేంద్రాలలో డాక్టర్లు, నర్సులు, సరిపడా మందులున్నాయా అనే ప్రశ్నకు జవాబు నా కన్నా మీకే బాగా తెలుసు. అలాగే డిస్పెన్సరీలు, పడకలు, టీబీ ఆసుపత్రుల సంఖ్య నెత్తిన మేకు కొట్టేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన వాటికన్నా 2.6 శాతం తక్కువ ఉన్నాయని కాగ్  మొట్టికాయ వేసింది.

 హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబు ఖాతాలోనే వెయ్యాలి. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు  హైదరాబాద్ ఒక ముఖం అయితే, మిగతా జిల్లాలు, గ్రామాలు మరొక ముఖం. ఆ ముఖాన్ని 2001 జనాభా లెక్కలు చూపించాయి. రాష్ట్రంలో కోటీ అరవైఎనిమిది లక్షల ఏభై వేల కుటుంబాలుంటే వారిలో 1.22 కోట్ల కుటుంబాలు ఇంకా పిడకలు, బొగ్గు, కట్టెపుల్లల మీదే వంటావార్పు చేసుకొంటున్నారు. 1.12 కోటి మందికి పొలాలు, పొలంగట్లు, రైలుపట్టాలే  మరుగుదొడ్లు. సగం కుటుంబాలకు ఎలాంటి మురుగునీటి సౌకర్యం లేదు. అయితే ఇదంతా చంద్రబాబు హయాంలో జరిగిందనడం లేదు. అంతకు ముందు నాలుగు దశాబ్దాలుగా పాలించిన వారి వాటా కూడా ఉంది. పేదరికం గ్రామాల్లో 11 శాతానికి పడిపోయిందని లెక్కలు చెప్పిన చంద్రబాబు, తన హయాంలో కూడా ఎంత తగ్గిందో చెబితే బావుండేది.

చంద్రబాబు పరిపాలన ప్రారంభించిన సంవత్సరంలో రాష్ట్రం అసలు, వడ్డీ చెల్లింపులు సగటున రోజుకు కోటి రూపాయలు. ఈ సగటు 2005-06 ఆఖరు నాటికి సుమారు 22 కోట్లు. రోజుకు 24 గంటలు కాబట్టి ఉజ్జాయింపుగా సగటున గంటకు కోటి రూపాయలు. అంటే 95-96లో రోజుకు ఒక కోటి రూపాయలైతే, 2005-06 నాటికి గంటకు కోటి రూపాయలు! ఎంత అభివృద్ధో!

అప్పుడాయన అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదంటూ రాష్ట్రం  ఆర్థికంగా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చారు. ఇప్పుడు కూడా శ్వేత పత్రాల విడుదల ప్రారంభించారు. చరిత్ర పునరావృతమవుతుందా?
 
(వ్యాసకర్త ఆర్థిక విశ్లేకులు)  వి. హనుమంత రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement