ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
రోలుగుంట: ప్రజల సంక్షేమం పట్టించుకోని రాష్ర్ట ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని కుసుర్లపూడి గ్రామంలో శ్రీదేవి పెద్దింటమ్మ ఉత్సవం సందర్భంగా గురువారం రాత్రి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అయన చర్చించారు. ప్రతి కార్యకర్త కష్టాల్లోను తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
రాష్ర్టంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తూతూ మంత్రంగా రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకున్నారని, దీని వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తుపాను బాధితులకు పూర్తి స్థాయిలో నేటికీ సాయం అందలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోలు, డీజీల్ ధరలు పెంచడం దారుణమన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరచడమే థ్యేయంగా టీడీపీ, బీజే పీ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆక్షేపిం చారు. మడ్డు అప్పలనాయుడు గృహంలో జరి గిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు టి.వి.రమణ, గొర్లె చెల్లమ్మనాయుడు, బంటు సూర్యసన్యాసి దేముళ్లు, మలసాల భాస్కర్రావు, తమటపు సత్యంనాయుడు, అడ్వకేట్ చలపతి, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.