వి.హనుమంతరావు
హైదరాబాద్: తిరుమలలో తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. తిరుపతిలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల
పంపిణీ ఉంటుందన్నారు.
సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాలనుకుంటే రాజీనామా చేసి ఉండొచ్చునన్నారు. తనవైపు నుంచి తప్పు జరిగితే క్షమాపణ చెబుతానన్నారు. భావోద్వేగాలు ఉన్నందున మీడియా సంయమనం పాటించాలని వీహెచ్ కోరారు.
తిరుమలలో కూడా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. దీంతో ఆగ్రహాం చెందిన సమైక్యవాదులు ఆలిపిరి వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు విహెచ్పై కేసు కూడా నమోదు చేశారు.