చిత్తూరు: రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తిరుమలకు వచ్చింది దైవ దర్శనానికా? లేక చిచ్చులు పెట్టడానికా? అని ఎమ్మెల్యే సీకే బాబు మండిపడ్డారు. తిరుమలలో చేసిన వ్యాక్యలు తిరిగి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ విహెచ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చునని, అయితే ఉద్యోగాలు చేయరాదని ఆయన అన్నారు. దాంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు విహెచ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు భారీ భద్రత నడుమ వీహెచ్ను రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.