నో ప్లేస్‌మెంట్ | No placement | Sakshi
Sakshi News home page

నో ప్లేస్‌మెంట్

Published Mon, Jun 8 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

No placement

నిరుద్యోగ యువతకు ఉపాధి కరువు
ఖరారు కానీ ఈజీఎంఎంకు విధివిధానాలు
ఈఎస్‌టీలో శిక్షణ పూర్తి చేసుకున్న  మూడు బ్యాచ్‌లు
ఉద్యోగాలు చూపని అధికారులు


 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగం పురుష లక్షణం.. ఇది ఒకప్పటి మాట. ఉద్యోగం జీవనాధారం అనేది ప్రస్తుతం వాస్తవం. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ప్రైవేటు రంగంలోనైనా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామనుకున్నా అవసరమైన నైపుణ్యం, శిక్షణ అవసరం. గత ప్రభుత్వం రాజీవ్ యువకిరణాల పేరుతో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధిని చూపించారు.

గత ఏడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈజీఎంఎం(ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మేనేజింగ్ మిషన్) ప్రారంభించారు. అయితే నేటికి దానికి సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలు ఖరారు కాలేదు. దీంతో జిల్లా అధికారులు చేతులెత్తాశారు. ఏడాది నుంచి ఒక్కరికీ ప్లేస్‌మెంట్ చూపించలేకపోయారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కరువైంది.

 ఒక్కరికీ ఉపాధి చూపని ఈజీఎంఎం
 ఈజీఎంఎంకు సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలేవి ఖరారు కాలేదు. దీంతో నిరుద్యోగ యువతకు శిక్షన ఇచ్చి ఉపాధిని చూపించేందుకు వీలుకావడం లేదని డీఆర్‌డీఏ అధికారులు పేర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో విధివిధానాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం 39 మంది నిరుద్యోగులతో ఒక బృందం శిక్షణ పొందుతోంది. వీరికి స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు ఇంగ్లిషు, కంప్యూటర్స్, వర్క్‌రెడీ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ తరగతులు మరో మూడు నెలల్లో పూర్తవ్వగానే స్థానికంగా లభించే ప్రైవేట్ ఉద్యోగాలను చూపిస్తామని జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాదుబాబు తెలిపారు.

మెప్మా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో పట్టణ జీవనోపాధుల మిషన్‌లో అమలవుతోంది. ఇందులో భాగంగా ఈఎస్‌టీ(ఎంప్లాయ్‌మెంట్ త్రో స్కిల్ అండ్ ట్రైనింగ్) పథకంలో ఇప్పటి వరకు 16 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. అందులో మూడు బ్యాచ్‌లకు మాత్రమే శిక్షణ తరగతులు ఇటీవలే పూర్తయ్యాయి. మిగతావి మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. శిక్షణ తరగతుల నిర్వహణలో పరుగులు పెట్టిన మెప్మా అధికారులు ప్లేస్‌మెంట్లు చూపడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఒక్కరికీ ఉపాధిని చూపిన దాఖలాలు కనిపించడంలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు మరో రెండు, మూడు వారాల్లో ఉద్యోగాలు చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెప్మా అధికారులు పేర్కొంటున్నారు.
 
 యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి
 ప్రైవేట్ ఉద్యోగల కోసం అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించాలి. అందుకు సంబంధించిన శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు చూపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజీవ్ యువ కిరణాల స్థానంలో వచ్చిన ఈజీఎంఎంకు విధివిధానాలను వెంటనే విడుదల చేయాలి. పథకం అమలయితే కొంతమందైనా శిక్షణ తీసుకొని ఉపాధిని పొందుతారు. స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి.
 - లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ నాయకులు 16 బ్యాచ్‌లకు శిక్షణ తరగతులు నడుస్తున్నాయి
 పట్టణ జీవనోపాధుల మిషన్‌లో యువతకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు నగరల్లోని యువతకు మెళకువలను నేర్పేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 16 బ్యాచ్‌లు ప్రారంభం కాగా మూడు పూర్తయ్యాయి. శిక్షణ పూర్తయిన బ్యాచ్‌లకు స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
             - వెంకటేశ్, జిల్లా ఉపాధికల్పనాధికారి, మెప్మా
 
 కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి
 ప్రభుత్వం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి. ఈ రోజు ఏ ఉద్యోగానికి వెళ్లిన కంప్యూటర్‌పై పట్టు ఉందా అని అడుగుతున్నారు. కనీసం బేసిక్స్‌పైనైనా శిక్షణ ఇవ్వాలి. గతంలో స్థానికంగానే కంప్యూటర్ ఉచితంగా నేర్పేవారు. ఇప్పుడు అలాంటి పద్ధతినే ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్లలో కంప్యూటర్ కోర్సులకు వేలల్లో తీసుకుంటున్నారు.
 - అంజి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement