బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్:
ఏటీఎంలకు రక్షణ కరువైంది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో దొంగతనాలు పెరిగాయి. కొన్నిచోట్ల సెక్యూరిటీ సైతం లేకపోవడంతో దొంగలు యథేచ్ఛగా తమ పనికానిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఒక్కో ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎస్‌బీఐకు మాత్రం ఓ సెక్యూరిటీని కేటాయించారు. ఎస్‌బీహెచ్‌కు మాత్రం నేటికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. ఉన్న సెక్యూరిటీ సైతం పట్టించుకోకపోవడంతో గుంపులుగా కేంద్రాల్లోకి దూసుకువెళుతున్నారు. ఇక ఎస్‌బీహెచ్ ఏటీఎం పరిస్థితి మరీ ఘోరం. ఓ వైపు జిల్లాలో ఏటీఎం కేంద్రాల్లో చోరీలు జరుగతున్నా, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా బ్యాంకు అధికారులు పట్టిం చుకోకపోవడం శోచనీయం, ఇకనైనా అధికారులు స్పందించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోటీసులు ఇచ్చాం : శ్రీనివాసరావు, సబ్‌ఇన్‌స్పెక్టర్
మండలంలోని బ్యాంకులకు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని సూచించాం.దీనికి సంబంధించి నోటీసులు జా రీ చేశాం. భద్రతలేకుండా చోరీలు జరిగే అవకాశం ఉంది.
ఏటీఎంలకు రక్షణ కరువు
Published Tue, Dec 24 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement