కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
‘రెండేళ్ల విద్యాకాలం పూర్తయింది. ఏడాదిపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెట్టిచాకిరీ చేస్తున్నాం. ప్రస్తుతం స్టైఫండ్ నిలిపివేయడంతో ఇబ్బం ది పడుతున్నాం. తమకు ఉపకార వేతనం ఇచ్చి ఆదుకోవాలి’ అంటూ ఒకేషనల్ కో ర్సులో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి శిక్షణ కోసం నగరానికి వచ్చామని, అద్దె రూముల్లో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం తమకు ఆర్థికంగా భారం అవుతోందని అంటున్నారు. గతంలో శిక్షణ కాలంలో ప్రభుత్వం నుంచి ఒక్కో వి ద్యార్థికి నెలకు రూ.2,500 స్టైఫండ్‌గా ఇచ్చేవారని, ప్రస్తుతం దానిని నిలిపివేశారని వా రు తెలిపారు. మిగతా కోర్సులకు శిక్షణా కాలంలో ఎంతోకొంత ఉపకార వేతనం ఇస్తారని, తమకు మాత్రమే అధికారులు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు.
ఒక్క జీఎం హెచ్‌లోనే 130 మందికిపైగా శిక్షణ పొందుతున్నవారు ఉన్నారని తెలిపారు. ఏఎన్‌ఎంలతోపాటు ఎంఎల్‌టీలదీ ఇదే పరిస్థితి అని అ న్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన తమకు స్టైఫండ్ పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌కు సుమారు వంద మంది విద్యార్థులు వచ్చారు. అపరి షృంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. లేదంటే తమ చదువులు ఆపేయాల్సి న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు.
పాస్‌లు ఇప్పించాలి
దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కనీసం ఆర్టీసీ అధికారులు జనరల్ పాస్‌లు ఇవ్వాలి. రూట్ పాస్‌లు ఇవ్వడం వల్ల నైట్ డ్యూటీ వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు ఈ సౌకర్యం కల్పించకుంటే ఇంట్లో వారు చదివించే పరిస్థితి లేదు. మాగోడు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.
- జ్యోతి, చల్వాయి, గోవిందరావుపేట
హాస్టల్‌లో అవకాశం ఇవ్వాలి
ఏడాదిపాటు ఖర్చులు భరిస్తూ చదవాలంటే మావల్ల కావడం లేదు. ఇంతకాలం స్టైఫండ్ వస్తుందని ఆశగా ఎదురుచూశాం. అధికారులు కల్పించుకుని సమస్య పరిష్కరించకుంటే హాస్టల్, ఇంటి అద్దెలు భరించలేకుండా ఉన్నాం. కనీసం ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లలో ఉచితంగా ఉండే అవకాశం కల్పించాలి.
- ధనలక్ష్మి, పరకాల
నెలకు రూ.2వేలు ఇవ్వాలి
ఆస్పత్రుల్లో శిక్షణ పేరుతో రాత్రి, పగలు సేవలందిస్తున్నాం. కనీసం నెలకు రూ.2వేలు ఉపకార వేతనంగా ఇస్తే బస్‌పాస్, ఇంటి అద్దె, హాస్టల్ ఫీజు సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవుతాయి. మిగతా వృత్తి విద్యా కోర్సులకు ఇస్తున్నారు. అందుకే మాకు కూడా అధికారులు ఉపకార వేతనం ఇచ్చి ఆదుకోవాలి.
- భవ్య, సుబేదారి
ఇదేం..‘శిక్ష’ణ
Published Sat, Dec 14 2013 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement