రుణ మాఫీ వద్దే వద్దు: రఘురామ్ రాజన్
ముంబై: రైతుల రుణమాఫీ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఒకవైపు తమ డిమాండ్‌ను కొనసాగిస్తుండగా, రాష్ట్రాలు అలాంటి రాయితీలను కోరే ఆలోచన విరమించుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం సూచించారు.
కొన్ని రాష్ట్రాలు ప్రకటించిన రుణమాఫీ,.. బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, బ్యాంకుల గుణాత్మక ఆస్తులు క్షీణిస్తాయని రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. 15 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, 27రాష్ట్రాల, 9 కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికశాఖల కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ జరిగిన సదస్సులో రఘురామ్ రాజన్ ప్రసంగించారు.