రాజకీయాలపై ప్రస్తుతం ఆసక్తి లేదు
నందమూరు(కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్: ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ శనివారం కొవ్వూరు మండలం నందమూరులో బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది
వినాయక్: కొద్ది రోజుల క్రితం ఈ విషయం పొక్కింది. కొందరు రాజకీయ నేతలు నన్ను పోటీ చేయనని అడిగారు. ప్రస్తుతం నాకు రాజకీయాలపై అంతగా ఆశక్తి లేదు. ఈ విషయమే వారికి చెప్పాను.
కారణం
వినాయక్: ప్రస్తుతం నా దృష్టంతా సినిమా దర్శకత్వంపైనే. నా స్నేహితుడు బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు వస్తారు.
వినాయక్: నేను దర్శకుడిని అవుతానని ఊహించలేదు. అయ్యాను. నా జీవితంలో ఏదీ ముందుగా ఇలా చేద్దామని అనుకోను. అనుకోకుండా జరుగుతాయంతే. ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. అంతా భగవంతుడి దయ.
పవన్‌కల్యాణ్ పార్టీపై మీ కామెంట్
వినాయక్: పార్టీపై నేను స్పందించను కానీ ఆయన సగటు మనిషి ఆవేదన వ్యక్తం చేశారని భావిస్తున్నా.
ప్రస్తుతం ఏ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు
వినాయక్: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా మాత్రమే చేస్తున్నాను. క్లైమాక్స్, రెండు పాటలు మినహా చిత్ర నిర్మాణం పూర్తయింది. సోమవారం నుంచి దుబాయ్‌లో షూటింగ్ చేస్తాం. హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. ఇది కమర్షియల్ చిత్రం. అన్ని హంగులు ఉంటాయి.
చిరంజీవితో సినిమా చేస్తానన్నారు ఎంత వరకూ వచ్చింది
వినాయక్: ఎన్నికలు అయిన తరువాత ఆయనతో కథా చర్చలు జరుపుతాను. ఆయన ఒప్పుకున్న వెంటనే సినిమా ప్రారంభిస్తాం.