విజయనగరం జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: జిల్లా ఉపాధికల్పన కార్యాలయ సేవలను మీసేవ కార్యాలయాలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన జీఓ నంబర్ 16 విడుదల అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. మీసేవ కేంద్రాలకు జిల్లా ఉపాధి కల్పనలో ఏ సేవలను అప్పగించాలనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. జిల్లా కేంద్రంలో ఉపాధికల్పన కార్యాలయం ఒక్కటే ఉన్నందున సదూర ప్రాంతాల విద్యార్థులు జిల్లా కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వ్యయ ప్రయాసలను తగ్గించేందుకు మీ సేవ కేంద్రాలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
మీసేవలో ఎక్కువగా రిజిస్ట్రేషన్
అయ్యే అవకాశాలు..
ఉపాధికల్పన కార్యాలయం జిల్లాకు ఒక్కటే ఉంటుంది. దూరం ఎక్కువగా ఉండడం, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ తగ్గు తోంది. మీసేవా కేంద్రాలు ప్రతి మండలం కేంద్రంలో ఎక్కువగా ఉంటాయి కనుక తమ సర్టిఫికెట్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయానికి వచ్చిన పత్రాలను అధికారులు వెరిఫికేషన్ చేసి పంపిస్తారు.
ఇప్పటికే అనేక సేవలు మీసేవలో..
ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన కులం, ఆదాయ, నివాస సర్టిఫికెట్స్, ఓబీసీ, భూములను సంబంధించిన అనేక పత్రాలు, జనన, మరణ సర్టిఫికెట్స్, ఓటర్, కరెం ట్ బిల్లు, మీటర్, డ్రైవిగ్ లెసైన్సు, ఎల్.ఎల్.ఆర్, వాహనాలకు సంబంధించిన రోడ్డుటాక్స్, పోలీసు కాండక్ట్ సర్టిఫికెట్స్, మైక్‌ల అనుమతులు తదితరాలను మీసేవకు అప్పగించారు మీసేవ ద్వారా అయితే అవినీతి అక్రమాలకు తావులేకుండా ఉంటుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ సేవలను కూడా అప్పగించినట్లు తెలుస్తోంది.
ప్రతిపాదనలు పంపించాం.
జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయానికి సంబంధించిన సేవలను మీసేవకు అప్పగించేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రభుత్వం జీఓ నంబర్ 16ను విడుదల చేసింది. ఏఏ సేవలను,ఎప్పుడు మీసేవకు అప్పగిస్తుందన్న విషయాలను స్పష్టం చేయలేదు. విధివిధానాలు తెలియలేదు.
‘మీసేవలో’నే ఎంప్లాయిమెంట్ సేవలు
Published Fri, Nov 1 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement
Advertisement