బాలికకు అధికారుల కౌన్సెలింగ్‌ | Officials Councelling To Child Marriage Girl In West Godavari | Sakshi
Sakshi News home page

బాలికకు అధికారుల కౌన్సెలింగ్‌

Published Wed, Oct 31 2018 1:20 PM | Last Updated on Wed, Oct 31 2018 1:20 PM

Officials Councelling To Child Marriage Girl In West Godavari - Sakshi

బాలికను బాలసదనంకు తరలిస్తున్న దృశ్యం

పశ్చిమగోదావరి, నరసాపురం రూరల్‌: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పరిధిలోని నక్కావారిపాలెంలో 16 ఏళ్ల బాలిక వివాహం చేసుకోగా ఐసీడీఎస్‌ అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చి బాలసదనంకు తరలించారు. ఐసీడీఎస్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నక్కావారిపాలెంలో ఓ బాలిక తండ్రి చనిపోగా.. తల్లి మేక ఏసుమణి కువైట్‌లో ఉపాధి పొందుతోంది. అమ్మమ్మ, తాతయ్యలు మేకా ప్రభాకరరావు, మంగతాయారు వద్ద బాలిక ఉంటోంది. ఈ నేపథ్యంలో వీరి ఇంటి సమీపంలోని ఓగిరాల బాబు అనే యువకుడితో పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. సోమవారం వీరి ద్దరూ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను, వారి బం ధువులను పిలిపించి ఎస్సై మూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్‌ సీడీపీఓ సీహెచ్‌ ఇందిర కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికను ఆకివీడులో బాలసదనం హోంకు తరలించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జి.వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్‌ ఝాన్సీలక్ష్మి సహకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement