శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వయంశక్తి సంఘాల్లో ఉండి, వివిధ రకాల బీమాల్లో చేరిన వారి పిల్లలకు అందజేసే ఉపకార వేతనాలకు ప్రభుత్వం ఎసరుపెట్టింది. ఉపకార వేతనాలు మహిళా స్వయంశక్తి సంఘంలో సభ్యులుగా ఉండి, వారు జనశ్రీ బీమా, అభయహస్తం, ఇతర బీమా చేయించుకున్నవారి పిల్లలకు వర్తించేది. దీని ప్రకారం ఆ విద్యార్థులు ప్రభుత్వ, ప్రవేటు సంస్థల్లో 9, 10, ఇంటర్, లేదా, ఐటీఐ, డిప్లామా వంటి కోర్సులు చుదువుతున్నవారికి ఒకరికి నాలుగు సంవత్సరాలు పాటు ఏడాదికి రూ.12 వందలు వంతున ఉపకార వేతనాలు అందజేసేవారు. అయితే ఈ ఏడాది ఈ ఉపకార వేతనాలు ఇప్పటి వరకు మంజూరు కాలేదు.
తిలోదకాలు
గత ఏడాది నుంచే జనశ్రీ బీమా యోజన, ఆమ్‌ఆద్మీ బీమా యోజన పథకాలకు ప్రభుత్వం తిలోదకాలిచిŠంది. ఇప్పటి వరకు సభ్యులు కట్టిన ప్రీమియం గాలిలో కలిసిపోయాయి. అప్పటి వరకు ఉన్న బీమా పథకాలను ఎత్తివేసిన సర్కార్ అన్నింటినీ కలిపి చంద్రన్న బీమా పథకంగా చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో ఇప్పటికీ చాలామంది చేరలేదు. దీంతో చంద్రన్న బీమా ప్రయోజనం కొంతమందికే పరిమితమైంది.
జిల్లాలో పరిస్థితి..
∙జిల్లాలో సుమారు 45 వేల మహిళా స్వయంశక్తి సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,75,000 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ఏదైనా ఒక బీమా పథకంలో చేరేవారు. అయితే ప్రస్తుతం అభయహస్తం మినహా మిగిలిన బీమా పథకాలను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అందరికీ చంద్రన్న బీమాలోనే చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పథకంలో చేరిన వారి పిల్లలు 9, 10, ఇంటర్ లేదా సమానమైన తరగతులు, డిప్లమా చేస్తున్న విద్యార్థులకు ఉపాకార వేతనం మంజూరు చేయాల్సిఉంది. చంద్రన్న బీమాలో చేరిన వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం చెబుతుంది. జిల్లాలో 2014–15 సంవత్సరంలో 66,081 మంది విద్యార్థులకు గాను రూ.7.92 కోట్లు, 2015–16 విద్యా సంవత్సరంలో 56,544 మందికి రూ. 6.78 కోట్లు ఉపకార వేతనాలు అందజేయగా.. ఈఏడాది ఇప్పటివరకు ఒక్కరికి కూడా రూపాయి అందజేయలేదు.
జిల్లాలో గత ఏడాది (2016–17) విద్యా సంవత్సరానికి పల్స్ సర్వే ఆధారంగా చంద్రన్న బీమాలో చేరిన వారి పిల్లలు 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్నవారు 1,23,273 మంది ఉన్నారు. వీరికి మొత్తం రూ. 14.79 కోట్లు మంజూరు చేయాల్సిఉంది. వీరికి ప్రతి సంవత్సరంలాగే..ఈ ఏడాది అగస్టు 15వ తేదీనాటికి ఈ ఉపకార వేతనాలు మంజూరు చేయాల్సి ఉన్నా సర్కార్ స్పందించలేదు. దీనికితోడు గత ఏడాది నుంచే విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సైతం నిలుపుదల చేశారు. కేలవం ఆధార్ ఆధారంగా.. చంద్రన్న బీమా ఉన్నవారి పిల్లలకు, ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆధార్ అనుసంధానం చేసిన ప్రాప్తికి ఈ ఉపకారవేతనాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విధానంతో తీవ్ర జాప్యం నెలకొంది. ఇప్పటికీ ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో జమకాకుండా 5,206 మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం చేస్తే తప్ప పిల్లలకు ఉపకార వేతనాలు అందే అవకాశం లేదు.
వారంలో ఉపకార వేతనాలు జమచేస్తాం
బీమా పథకం వర్తింపజేసే విద్యార్థుల ఉపకార వేతనాలు మరో వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఈ పథకంలో మార్పులు రావడంతో ఆలస్యమైంది. ఇక నుంచి ఎంటువంటి దరఖాస్తు చేయకుండానే కళాశాల, పాఠశాలల యాజమాన్యాలు ఆధార్ అనుసంధానం చేస్తే ఆర్హులైన 9, 10, ఇంటర్, లేదా సమానమైన కోర్సులు చదువుతున్న వారికి ఉపకార వేతనం అందుతుంది. – సీతారామయ్య, డీఆర్‌డీఏ ఏసీ
Comments
Please login to add a commentAdd a comment