ఆయిల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం నాయకుడి మృతి | Oil tanker stumbling CPM leader's death | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం నాయకుడి మృతి

Published Fri, Dec 19 2014 3:28 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Oil tanker stumbling CPM leader's death

నెల్లూరు, సిటీ:  ఆరుుల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం సీనియర్ నాయకుడు అరిగెల నారాయణ(75) మృతిచెందిన సంఘటన గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేం దుకు నారాయణతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణతో కలిసి స్కూటర్‌పై నెల్లూరు నుంచి కనుపర్తిపాడు బయలుదేరారు. హైవే ఎక్కేందుకు గొలగమూడి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న ఆరుుల్ ట్యాంకర్ ఢీకొట్టింది.
 
 నారాయణ తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సోదరుడు రాధాకృష్ణకు తీవ్ర గాయూలుకావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని సింహపురి ఆస్పత్రికి తరలించారు. రాధాకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాధాకృష్ణ బండి నడుపుతుండగా నారాయణ వెనుక కూర్చున్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్  డ్రైవర్ పరారయ్యూడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదో నగర సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement