కొత్త సీసాలో పాత సారా.. | Old alcohol in a new alcohol policy | Sakshi
Sakshi News home page

కొత్త సీసాలో పాత సారా..

Published Tue, Jun 24 2014 12:42 AM | Last Updated on Fri, Aug 17 2018 7:51 PM

కొత్త సీసాలో పాత సారా.. - Sakshi

కొత్త సీసాలో పాత సారా..

ఖరారైన నూతన మద్యం విధానం
లాటరీ పద్ధతిలోనే దుకాణాల కేటాయింపు
బార్లకు మూడు, మద్యం దుకాణాలకు ఐదు శ్లాబులుగా లెసైన్స్ ఫీజు
కొన్ని శ్లాబుల్లోనే స్వల్పంగా ఫీజుల పెంపు
జిల్లాలో 342 మద్యం దుకాణాలు, 187 బార్లకు నోటిఫికేషన్ విడుదల
 

గుంటూరు :
 నూతన మద ్యం విధానం ఎట్టకేలకు ఖరారయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేస్తూ సంతకం చేశారు. దీనికి అనుగుణంగా నూతన మద్యం విధానంలో సమూలమైన మార్పులు చేస్తారని, కర్ణాటక, మహారాష్ట్ర మాదిరిగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని ప్రచారం జరిగింది. కానీ మార్పులు చేయకుండా కేవలం రెండు మూడు శ్లాబుల్లోని దుకాణాలకు మూడు, నాలుగు లక్షల రూపాయలు ఫీజులు పెంచి పాత విధానాన్నే నిత్యావసర సరుకులను చౌకగా అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టింది. కానీ, ఈ పథకం ఆరంభం నుంచే అభాసుపాలవుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా చౌకధరల దుకాణాలకు సరుకులను దిగుమతి చేయడంలో అధికారులు విఫలమౌతూనే ఉన్నారు.

పంపిణీ ప్రక్రియ ఇదీ..

ప్రతి నెలా 15వ తేదీ నుంచి 18వ తేదీలోగా చౌకధరల దుకాణాలకు సంబంధించిన సరకుల అలాట్‌మెంట్‌ను ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేస్తారు. ఈ కేటాయింపుల ఆధారంగా రేషన్ డీలర్లు డీడీలు చెల్లిస్తారు. చెల్లించిన వారికి నెలాఖరులోగా సరుకులను దిగుమతి చేస్తారు. ఆ సరుకులను ఆ మరుసటి నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా జరిగే ప్రక్రియ ఇది. కొన్ని నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ నెల 24వ తేదీ వచ్చినప్పటికీ ఇంత వరకూ చౌకధరల దుకాణాలకు సరుకుల ఎలాట్‌మెంట్‌ను ఆన్‌లైన్ చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో మినహా ఎక్కడా రేషన్ డీలర్‌లు డీడీలు చెల్లించలేదు. ఇంత వరకూ ఎంత మొత్తానికి డీడీలు తీయాలో అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో డీలర్లు అయోమయానికి లోనవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement