Lesains fees
-
పల్లె.. గుల్ల!
భారీగా పెరిగిన పన్నులు ► కుళాయి కనెక్షన్‌కు రూ.10 వేలు ► లెసైన్సు ఫీజు ఏకంగా 100 శాతం అధికం ► బిల్డింగ్ అనుమతి రుసుము భారీగా పెంపు ► ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్నులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పల్లెలకు పన్నుల సెగ తగిలింది. కుళాయి కనెక్షన్ మొదలు.. బిల్డింగ్ అనుమతి, ఇతర అన్నిరకాల పన్నులు భారీగా పెంచేశారు. 5 నుంచి 150 శాతం వరకు వివిధ రకాల పన్నులు పెరిగాయి. ఇకపై గ్రామాల్లో కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఏకంగా రూ.10 వేల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటి పన్ను కూడా 5 శాతం మేరకు పెరిగింది. లెసైన్స్ ఫీజు మొత్తం కూడా 100 శాతం అధికం చేస్తూ నిర్ణయించారు. పెంచిన పన్నుల భారం ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. అన్నింటిలోనూ పెంపే.. గ్రామ పంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు భారీగా పన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇంటికి కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఏకంగా రూ.10 వేల రూపాయలు చెల్లించాల్సి రానుంది. కుళాయి కనెక్షన్‌కు మొన్నటి వరకు రూ.5 వేలు మాత్రమే ఉండేది. తాజా మార్పుతో ఏకంగా 100 శాతం భారం పడుతోంది. ఇక బిల్డింగ్ అనుమతి ఫీజు కూడా భారీగానే పెరిగింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం బిల్డింగ్ ఫీజు చదరపు అడుగునకు రూ.24లుగా ఉంది. ఇది కాస్తా ప్రస్తుతం రూ.85లకు చేరుకుంది. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ వేలాల ఫీజు కూడా 50 శాతం మేరకు పెంచారు. ఉదాహరణకు.. దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ వేలం ఫీజు రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు చేరుకుంది. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల మోత మోగుతోంది. పంచాయతీలపై ఒత్తిళ్లు పంచాయతీల్లో పన్నుల పెంపునకు తీవ్ర ఒత్తిళ్లు అధికమయ్యాయి. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంటు బిల్లుల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. దీంతో పన్నుల భారం వేయాల్సిన అవసరం పంచాయతీలకు ఉండేది కాదు. అయితే, ఈ కరెంటు బిల్లుల భారాన్ని మొత్తం పంచాయతీలే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆర్థిక సంఘం నిధులు కూడా నేరుగా పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలంటే అందులో 50 శాతం కచ్చితంగా పంచాయతీలే భరించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కాస్తా పంచాయతీల ఆదాయ వనరులను తప్పక పెంచుకోవాల్సిన పరిస్థితికి కారణమయింది. ఈ నేపథ్యంలో పన్నుల పెంపు దిశగా పంచాయతీలు అన్వేషణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి పన్నుల భారాన్ని మోపడం మొదలయింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజల జేబుకు చిల్లు పడుతోంది. -
కొత్త సీసాలో పాత సారా..
ఖరారైన నూతన మద్యం విధానం లాటరీ పద్ధతిలోనే దుకాణాల కేటాయింపు బార్లకు మూడు, మద్యం దుకాణాలకు ఐదు శ్లాబులుగా లెసైన్స్ ఫీజు కొన్ని శ్లాబుల్లోనే స్వల్పంగా ఫీజుల పెంపు జిల్లాలో 342 మద్యం దుకాణాలు, 187 బార్లకు నోటిఫికేషన్ విడుదల గుంటూరు : నూతన మద ్యం విధానం ఎట్టకేలకు ఖరారయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేస్తూ సంతకం చేశారు. దీనికి అనుగుణంగా నూతన మద్యం విధానంలో సమూలమైన మార్పులు చేస్తారని, కర్ణాటక, మహారాష్ట్ర మాదిరిగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని ప్రచారం జరిగింది. కానీ మార్పులు చేయకుండా కేవలం రెండు మూడు శ్లాబుల్లోని దుకాణాలకు మూడు, నాలుగు లక్షల రూపాయలు ఫీజులు పెంచి పాత విధానాన్నే నిత్యావసర సరుకులను చౌకగా అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టింది. కానీ, ఈ పథకం ఆరంభం నుంచే అభాసుపాలవుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా చౌకధరల దుకాణాలకు సరుకులను దిగుమతి చేయడంలో అధికారులు విఫలమౌతూనే ఉన్నారు. పంపిణీ ప్రక్రియ ఇదీ.. ప్రతి నెలా 15వ తేదీ నుంచి 18వ తేదీలోగా చౌకధరల దుకాణాలకు సంబంధించిన సరకుల అలాట్మెంట్ను ఆన్లైన్ ద్వారా మంజూరు చేస్తారు. ఈ కేటాయింపుల ఆధారంగా రేషన్ డీలర్లు డీడీలు చెల్లిస్తారు. చెల్లించిన వారికి నెలాఖరులోగా సరుకులను దిగుమతి చేస్తారు. ఆ సరుకులను ఆ మరుసటి నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా జరిగే ప్రక్రియ ఇది. కొన్ని నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ నెల 24వ తేదీ వచ్చినప్పటికీ ఇంత వరకూ చౌకధరల దుకాణాలకు సరుకుల ఎలాట్‌మెంట్‌ను ఆన్లైన్ చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో మినహా ఎక్కడా రేషన్ డీలర్లు డీడీలు చెల్లించలేదు. ఇంత వరకూ ఎంత మొత్తానికి డీడీలు తీయాలో అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో డీలర్లు అయోమయానికి లోనవుతున్నారు. -
ఖజానాకు కిక్కు
మద్యం దుకాణాల డీలర్ల ఖరారు దరఖాస్తుల ద్వారారూ.3.4 కోట్లు.. దుకాణాల ద్వారా రూ. 64.57 కోట్ల ఆదాయం అదృష్టవంతుల్లో ఆరుగురు మహిళలు సంగారెడ్డి క్రైం: మద్యం దుకాణాల కేటాయింపుతో ఖజానాకు కిక్కెక్కింది. జిల్లాలోని 161 మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులు ద్వారా రూ.3.4 కోట్లు, లెసైన్స్ ఫీజు ద్వారా 64.57 కోట్లు ఖజానాకు చేరింది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ డ్రా పద్ధతిలో డీలర్లను ఎంపిక చేశారు. కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా జిల్లాలోని 176 దుకాణాలకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అయితే 161 దుకాణాలకు గానూ 1,217 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సోమవారం సంగారెడ్డిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్ లాటరీ తీసి డీలర్లను ఖరారు చేశారు. అయితే పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తు చేసిన ఠమొదటిపేజీ తరువాయి ఇద్దరు గైర్హాజరు కాగా, మిగతా 159 మద్యం దుకాణాలకు డీలర్లను ఖరారు చేశారు. జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాష, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, సూపరింటెండెంట్ రఘురాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా ఆదాయం జిల్లాలోని నోటిఫై చేసిన మద్యం దుకాణాల కోసం వచ్చిన 1,217 దరఖాస్తుల ద్వారా రూ.3 కోట్ల 4 లక్షల 25 వేలు ఆదాయం వచ్చింది. ఇక లెసైన్సు ఫీజు ద్వారా సంగారెడ్డి యూనిట్ పరిధిలో 85 దుకాణాలకు రూ. 40 కోట్ల 70 లక్షలు, మెదక్ యూనిట్ పరిధిలో 74 దుకాణాలకు రూ.25 కోట్ల 67 లక్షల 50 వేలు... మొత్తంగా రూ.64 కోట్ల 57 లక్షల 50 వేలు ఆదాయం సమకూరింది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. దుకాణాలు దక్కించుకున్న వారంతా ఏడు రోజుల్లోగా నిబంధనల పూర్తి చేసి లెసైన్సులు పొందాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలు మళ్లీ ప్రారంభమవుతాయి. కార్యాలయ ఆవరణలో సందడి మద్యం దుకాణాలకు డీలర్ల ఎంపిక సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జనం కిక్కిరిసిపోయారు. దరఖాస్తు చేసుకున్న వారంతా భార్యాపిల్లలతో సహా తరలిరావడంతో కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు కూడా ఉండడంతో...వారు తమ బంధువులను వెంటబెట్టుకుని వచ్చారు. డ్రా ప్రారంభించగానే దరఖాస్తు దారులంతా అదృష్టం తమను వరిస్తుందా,..లేదా అంటూ ఉత్కంఠకు గురయ్యారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో డీఎస్పీ వెంకటేష్, సీఐలు కె.శివశంకర్‌నాయక్, శ్యామల వెంకటేష్, శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
కొత్త సీసాలో.. పాత మద్యమే!
శ్రీకాకుళం క్రైం: పాత సీసాలో కొత్త మద్యం.. అంటే ఏమిటో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ఎక్సైజ్ విధానం తేటతెల్లం చేయనుంది. సోమవారం ఈ కొత్త విధానాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాత, కొత్త విధానాల మధ్య పెద్ద తేడా లేదని తెలిసింది. రెండు శ్లాబుల లెసైన్స్ ఫీజు మాత్రమే మార్చారు. దీంతో కొత్త ఎక్సైజ్ విధానం ఎలా ఉంటుందోనని గత కొద్దిరోజులుగా టెన్షన్‌కు గురవుతున్న మద్యం వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వల్ప మార్పులతో సరి జిల్లా వ్యాప్తంగా 232 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి వీటిని మూడు శ్లాబులుగా విడదీసి లెసైన్స్ ఫీజు నిర్ణయించేవారు. 2011 వరకు టెండర్ల ద్వారా షాపులను కేటాయించేవారు. 2012లో లాటరీ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అప్పట్లో రూ.32.50 లక్షలు, రూ.34 లక్షలు, రూ.42 లక్షలుగా మూడు శ్లాబులు నిర్ణయించారు. వాటి పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు అసక్తిగల వారు రూ.25వేలు డీడీ తీసి లాటరీలో పాల్గొనేవారు. బినామీ పేర్లతో నచ్చినన్ని దరఖాస్తులు దాఖలు చేసేవారు. కాగా ఈ ఏడాదికి ప్రకటించనున్న కొత్త విధానంలో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. మూడు శ్లాబుల్లో రెండింటి లెసైన్సు ఫీజులనే పెంచారు. రూ.32.50 లక్షల శ్లాబ్‌ను అలాగే ఉంచారు. రూ.34 లక్షల శ్లాబ్‌ను రూ.36 లక్షలకు, రూ.42 లక్షల శ్లాబ్‌ను రూ.45 లక్షలకు పెంచారు. బెల్ట్ దుకాణాల మూసి వేస్తామని సర్కారు ఇచ్చిన హామీ కారణంగా లెసైన్సు ఫీజును పెద్దగా పెంచలేదని చెప్పుకొనేందుకే ఈ ప్రయత్నమని తెలుస్తొంది. కాగా బార్లకు సంబంధించి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. లెసైన్సు ఫీజు ఎంత పెంచాలన్నదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బహుశా సోమవారం సాయంత్రానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బెల్ట్ తీయటం కష్టమే! అధికారంలోకి వస్తే బెల్ట్ దుకాణాలను పూర్తిగా మూసివేయిస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ హామీ ఇచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీని పరిశీలిస్తే అది అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. గత పాలసీకి ఈ పాలసీకి పెద్దగా మార్పులు లేవు. పైగా రెండు శ్లాబ్‌ల లెసైన్స్ ఫీజులను కొద్దిగా పెంచారు. ప్రస్తుతం బెల్ట్ దుకాణాల ఉండటంతో మద్యంవ్యాపారులు తమ వ్యాపారాలను లాభసాటిగా మలచుకున్నారు. బెల్ట్ దుకాణాలను మూసివేస్తే అన్ని లక్షలు ఖర్చుపెట్టి వ్యాపారం చేయటం కష్టమని వ్యాపారులు అంటున్నారు. బెల్ట్ దుకాణాలు తీసేస్తేమంటున్నారు కనుక గత లెసై న్సు ఫీజుల కంటే ఈ కొత్త పాలసీలో ఫీజు తగ్గుతుందన్న భావనలో మద్యం వ్యాపారులు ఉన్నారు. కాని రెండు శ్లాబుల్లో లెసైన్సు ఫీజును పెంచుతూ కొత్త పాలసీ ప్రకటిస్తున్నందున బెల్ట్ దుకాణాలను యాథావిధిగా నడిపే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.