
5న డీఎస్సీ నోటిఫికేషన్: గంటా
కుప్పం: ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన కొత్త డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ విద్య, వూనవ వనరుల శాఖ వుంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. సోవువారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. డీఎస్సీ ద్వారా 10,500 పోస్టుల భ ర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విద్యా రంగం దశ, దిశ వూర్చేందుకు సెప్టెంబర్ 5న 13 విశ్వవిద్యాలయూల ఉపకులపతులతో ప్రత్యేక సవూవేశం నిర్వహిస్తావున్నారు. ప్రభుత్వ పాఠశాలలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా భవనాలు, వసతులు, వురుగుదొడ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. వూనవ వనరుల శాఖకు సంబంధించి నూతన వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.