మంకమ్మతోట, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి కొండ రాఘవరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2కార్పొరేషన్లలో 100 కార్పొరేటర్ స్థానాలు, 9 మున్సిపాలిటీల్లో అన్ని కౌన్సిలర్ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని తెలిపారు. సంక్షేమమే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో శాతవాహన విశ్వవిద్యాలయం, రూ.1300 కోట్లతో రాజీవ్ రహదారి, రూ.73కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రె రుునేజీ నిర్మాణం చేపట్టారన్నారు. రాజీవ్‌గృహకల్ప, ఎల్లంపల్లి ప్రాజెక్టునిర్మాణం, నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత వి ద్యుత్ సౌకర్యం కల్పిస్తూ మొదటి సంతకం చేశారని గు ర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని, పెద్ద రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని తమ అధినేత భావిం చారన్నారు.
పజా సంక్షే మంకోసం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారని, వారంతా వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు సాధించి విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీచేస్తామని, తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల, వైఎస్.విజయమ్మ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. నగర కన్వీనర్ డాక్టర్ కె.నగేశ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బోరుునపల్లి శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమార్, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ మోకెనపెల్లి రాజమ్మ, రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు మోతె గంగారెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ బోగె పద్మ, ఎస్టీసెల్ జిల్లా కన్వీనర్ భూక్య రఘునాయక్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ జూపాక సుదర్శన్, మహిళావిభాగం జిల్లాప్రధాన కార్యదర్శి గంట సుశీల, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎండీ.అస్లమ్, నగరకన్వీనర్ ఎస్‌కే.జావిద్, వేణుమాధవ్‌రావు, అవినాశ్‌రెడ్డి, కాసారపు కిరణ్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
మంకమ్మతోట, న్యూస్‌లైన్ : నగరంలోని ఒకటి, 21వ డివిజన్‌కు చెందిన పలువురు యువకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. విద్యార్థి నాయకులు అవినాశ్‌రెడ్డి, గంగాధర కల్యాణ్, మోతె రాకేశ్ ఆధ్వర్యంలో చేరిన వీరికి పార్టీ అధికార ప్రతినిధి, మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఒకటో డివిజన్‌కు చెందిన గంగాధర భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, లక్ష్మి, భరణి, సంతప్, శ్రీనివాస్, కనకరావు, థామస్, వంశీ, సిద్దార్థ, రాజు, సాయి, జనార్దన్, మిహ పాల్, 21వ డివిజన్ నుంచి రాజు, రాకేశ్, కార్తీక్, సాయిచరణ్, సాయిరామ్, ప్రకాశ్, ఆదిత్య, సురేష్, శ్రావణ్, అజయ్, విజయ్, గగన్, అభిరామ్, రమేష్, శ్రీను, చందు, హరీశ్, నరేశ్, షఫీ, సాయిచంద్, వంశీ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ బరిలో వైఎస్సార్‌సీపీ
Published Wed, Mar 12 2014 2:50 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement