వైఎస్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు.. | Raghuveera Reddy comments on YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు..

Published Sat, Sep 3 2016 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వైఎస్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు.. - Sakshi

వైఎస్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు..

వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

 సాక్షి, అమరావతి: స్వార్థపరులు, బలహీనమైన నాయకుల వల్లనే రాష్ట్రం రెండుగా విడిపోయిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి చెప్పారు. వైఎస్ అంటేనే ప్రజలు అని.. ప్రజాసమస్యలే కాంగ్రెస్ పార్టీ అజెండా అని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో శుక్రవారం పీసీసీ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ హయాంలో రైతుల కోసం ప్రారంభించిన జలయజ్ఞం ప్రస్తుతం టీడీపీ నాయకులు తన వారికి దోచిపెట్టేందుకు ధనయజ్ఞంగా మార్చుతున్నారని మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రజలకు నిజమైన సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు, మల్లాది విష్ణు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement