
మద్యం మత్తులో హత్య
అర్ధవీడు: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆలుమూరి రమణ(35) అనే వ్యక్తిని ఆయన బావమరిది పోలేపల్లి శ్రీనివాసులు కత్తితో పొడిచాడు.
తీవ్రరక్త స్రావం కావడంతో రమణను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయిన మార్గమధ్యంలో మృతిచెందాడు. మద్యం మత్తులో క్షణిక ఆవేశానికి గురై శ్రీనివాస్ ఈ హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.