బత్తలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం మధ్యాహ్నాం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం వైపు వెళ్తున్న కారును, వెనక నుంచి లారీ ఢీకొట్టింది. అదే ఊపులో పోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా..ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బత్తలపల్లిలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
Published Wed, Feb 3 2016 1:33 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement