పెద్దమందడి, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం ఒంటిపై పె ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పెద్దమందడి మండలకేంద్రానికి చెందిన విరళాసాగర్(25)అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ విషాదకర సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన వెంకటమ్మ, బాలస్వామిల కొడుకు విరళాసాగర్. తల్లిదండ్రులు చనిపోవడంతో అతడు బెంగళూరులో డీసీఎం వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ కోసం రెండురోజుల క్రితం పెద్దమందడికి వచ్చాడు. మంగళవారం రాత్రి గ్రామంలోనే ‘జై తెలంగా ణ’ అంటూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఇది గమనించిన స్థానికులు చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. న్యాయమూ ర్తి బాధితుడి వాంగ్మూలం తీసుకున్నారు. తెలంగాణ కో సమే తాను నిప్పంటించుకున్నట్లు చెప్పాడు. కేసునమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ తెలిపారు.
తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
Published Wed, Oct 9 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement