ఒంగోలు గిత్త అదిరింది..
పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. కనుపర్తిపాడు సమీపంలోని ట్రస్ట్ మైదానంలో మూడురోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి ఒంగోలు జాతి గిత్తలు, కోడెదూడలు, ఆవులు తరలి రావడంతో వాటిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నిర్వాహకులు పశువుల కోసం ప్రత్యేక టెంట్లు, వెద్య సేవలు ఏర్పాటు చేశారు.
- నెల్లూరు