సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా కలెక్టర్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి త్వరలోనే శంకు స్థాపన చేయనున్నారు. కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూనత భవనం కోసం కలెక్టర్ విజయకుమార్ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో పాటు నిధులు కేటాయించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన జీఓ కలెక్టర్‌కు చేరే అవకాశ ం ఉంది.
దాదాపు 120 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ భవనంలో 8 అంతస్తులుంటాయి. ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఎదురుగా ఉన్న పాత రిమ్స్ భవనాన్ని స్కై బ్రిడ్జితో అనుసంధానం చేయనున్నారు. ఈ రెండు భవనాల మధ్య జీఎన్‌టీ రోడ్డు ఉన్నప్పటికీ.. అండర్ గ్రౌండ్‌లో కార్లు వెళ్లే విధంగా, పాదచారులు నడిచి వెళ్లేందుకు స్కై బ్రిడ్జిని నిర్మింనున్నారు. బేస్‌మెంట్‌లో కార్ల పార్కింగ్‌కు స్థలం కేటాయించి, 5.8మీటర్ల వెడల్పుతో రెండో భవనానికి సబ్‌వే నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 750మందికి సరిపడే మీటింగ్ హాల్, వీఐపీ లాంజ్ నిర్మిస్తున్నారు. వీఐపీ కార్ పార్కింగ్‌కు ఇక్కడే స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో గ్రీవెన్స్ హాల్, కార్యాలయాలను నిర్మించనున్నారు.
మిగిలిన కార్యాలయాలకు పై అంతస్తుల్లో గదులు కేటాయించనున్నారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నూతన భవనం కోసం ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాం. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సీఎం సూచించారు. నిధులు మంజూరు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన జీఓ త్వరలోనే వచ్చే అవకాశముంది. జిల్లాలో చేపట్టిన అక్షర విజయం కార్యక్రమం మంచి ఫలితాలు సాధిస్తోంది. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలు పరిష్కరించగలుగుతున్నాం.
రాష్ట్రానికే తలమానికం కానున్న ప్రకాశం భవనం
Published Fri, Feb 14 2014 3:15 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement