సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ మళ్లీ మొదటికి వచ్చింది. గత కాలంగా జిల్లాలో ఏనుగుల గుంపు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎల్.ఎన్. పేట మండలం వాడాడ, మిరియాబెల్లి మధ్య ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, ప్రజలు.. ఏనుగుల గుంపును అడవుల్లోకి తరిమికొట్టారు. జయంతి, వినాయక కుంకీ ఏనుగుల సహకారంతో అధికారులు ఆపరేషన్ గజ నిర్వహించారు.
కానీ మళ్లీ గజరాజులు అడవి దారి వదిలి మైదానం బాట పట్టాయి. మెళియపుట్టి మండలం సరిహద్దు నుంచి పలాస మండలం టకోయికొండ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సమీప గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరో వైపు నందవ కొత్తూరు ప్రాంతంలో నాలుగు రోజులుగా తిష్ట వేసి ఇద్దరి గిరిజనులను పొట్టన పెట్టుకున్న ఏనుగుల గుంపు నందల కొండ దాటి మూకనా పురం ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో నందవలో ఉన్న ఆపరేషన్ గజేంద్ర ఏనుగులను కూడా అవతలి వైపుకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment