Operation Gaja
-
మొదటికొచ్చిన ‘ఆపరేషన్ గజ’
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ మళ్లీ మొదటికి వచ్చింది. గత కాలంగా జిల్లాలో ఏనుగుల గుంపు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎల్.ఎన్. పేట మండలం వాడాడ, మిరియాబెల్లి మధ్య ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, ప్రజలు.. ఏనుగుల గుంపును అడవుల్లోకి తరిమికొట్టారు. జయంతి, వినాయక కుంకీ ఏనుగుల సహకారంతో అధికారులు ఆపరేషన్ గజ నిర్వహించారు. కానీ మళ్లీ గజరాజులు అడవి దారి వదిలి మైదానం బాట పట్టాయి. మెళియపుట్టి మండలం సరిహద్దు నుంచి పలాస మండలం టకోయికొండ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సమీప గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరో వైపు నందవ కొత్తూరు ప్రాంతంలో నాలుగు రోజులుగా తిష్ట వేసి ఇద్దరి గిరిజనులను పొట్టన పెట్టుకున్న ఏనుగుల గుంపు నందల కొండ దాటి మూకనా పురం ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో నందవలో ఉన్న ఆపరేషన్ గజేంద్ర ఏనుగులను కూడా అవతలి వైపుకు తీసుకెళ్లారు. -
శ్రీకాకుళంలో ఆపరేషన్ గజ..
సాక్షి, శ్రీకాకుళం : అడవి నుంచి వచ్చిన ఏనుగులు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాలుగు ఏనుగులతో కూడిన గుంపు కొత్తూరు మండలం కుద్దిగాం, పొన్నుటూరు గ్రామాల మధ్య మొక్కజొన్న తోటల్లో సంచరిస్తుంది. ఏనుగుల గుంపు ఒకవేళ గ్రామాలవైపు వస్తే తమ పరిస్థితి ఏమిటని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిరమండలం బొంతసవర గ్రామ కొండపై ఎనిమిది ఏనుగులు తిరుగుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అడవి ఏనుగులను తరలించేందుకు జయంత్, వినాయక్ అనే ఏనుగులను అధికారులు రంగంలోకి దింపారు. వాటి సాయంతో అడవి ఏనుగులను తరలించడానికి ‘ఆపరేషన్ గజ’ చేపట్టారు. త్వరలోనే ఏనుగులను తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. -
నేటి నుంచి ఆపరేషన్ ‘గజ’
కురుపాం: ఏజెన్సీలో చొరబడి గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘ఆపరేషన్ గజ’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి ఏవీ రమణమూర్తి తెలిపారు. మండలంలోని తిత్తిరి పంచాయతీ ఎగువగుండాం గిరిశిఖర గ్రామంలో వారం రోజులుగా నాలుగు ఆడ అడవి ఏనుగులు తిష్ఠ వేసి రెండు గిరిజన గ్రామాల్లో 15 ఇళ్లను, అరటి, వరి పంటలతోపాటు గిరిజనులు దాచుకున్నధాన్యం బస్తాలను సైతం ధ్వంసం చేసిన సంఘటన విదితమే. ఈ మేరకు డీఎఫ్ఓ రమణమూర్తి ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే ఏనుగులను తరలించేందుకు బెంగళూరు నుంచి నిపుణుడైన వైల్డ్ ఎలిఫెంట్ ఎక్స్పర్ట్ రుద్రాదిత్య వస్తున్నారని తెలిపారు. విశాఖ జిల్లా ఐఎఫ్ఎస్ అధికారి ఎన్.ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ గజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒడిశా లేదా శ్రీకాకుళం అడవుల్లోకి తరలించేందుకు చర్యలు కురుపాం ఏజెన్సీలోకి ప్రవేశించిన నాలుగు అడవిఏనుగులను శ్రీకాకుళం జిల్లా లేదా ఒడిశా అడవుల్లోకి ప్రణాళికా పరంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ రమణమూర్తి అధికారులు తెలిపారు. ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు గజరాజుల ప్రభావిత ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల మేరలో గిరిశిఖరాల చుట్టూ ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని డీఎఫ్ఓ తెలిపారు. ఈ ఎలిఫెంట్ ట్రంజ్ వల్ల గజరాజులు గ్రామాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని భయంతో వెను తిరగడమే కాకుండా గిరిజన గ్రామాల వైపు భవిష్యత్‌లో కూడా రాకుండా ఉంటాయని తెలిపారు. -
ఆపరేషన్ గజ...సక్సెస్
మక్కువ/సాలూరు,రూరల్: ఒడిశా నుంచి వచ్చిన ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. సుమారు 200 మంది అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది శ్రమించి ఆపరేషన్ ‘గజ’ను విజయవంతం చేశారు. చిత్తూరు నుంచి రెండు కొంకిస్( శిక్ష ణపొందిన) ఏనుగులను సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి సోమవారం తీసుకువచ్చారు. అయితే రాత్రి గున్న ఏనుగుజాడ తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం సాలూరు మండలం రెయ్యివానివలస గ్రామం సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోతట్టు ప్రాంతంలోని వాగువద్ద గున్న ఏనుగు సేదతీరుతుండడాన్ని అధికారులు గమనించారు. మామిడిపల్లినుంచి కొంకిస్ ఏనుగులను పసుపువానివలస, రెయ్యివానివలస గ్రామాల మీదుగా నడిపించుకుంటూ మధ్యాహ్నం 12గంటల సమయానికి గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున కొంకిస్ ఏనుగుల అలసట తీరి, అవి సేదతీరేవరకూ వేచి ఉండి సాయంత్రం 4.14నిమిషాలకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ జరిగిందిలా... విశాఖపట్నం జూ డాక్టర్ శ్రీనివాస్ మత్తు ఇంక్షన్ గల తుపాకీతో జయంతి ఏనుగుపై కూర్చుని గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి సమీపంలోకి చేరుకున్నారు. అనంతరం గున్న ఏనుగును జయంతి మచ్చిక చేసుకుంది. జయంతికి తోడుగా వినాయక్ అనే ఏనుగు కూడా గున్న ఏనుగు వద్దకు చేరుకుంది. అవి గున్న ఏనుగును బహిరంగ ప్రదేశానికి తీసుకువచ్చాయి. జూ డాక్టర్ తుపాకీలో లోడ్‌చేసి ఉన్న మత్తు ఇంజక్షను గున్న ఏనుగుపై ప్రయోగించారు. దీంతో అది సృ్పహతప్పి పడిపోయింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది తాళ్లు, గొలుసులను కాళ్లకు కట్టారు. గున్న ఏనుగుకు కొంత సృ్పహ వచ్చిన వెంటనే కొంకిస్ ఏనుగుల మధ్యన దానిని ఉంచి లారీవద్దకు తీసుకు వచ్చి ఎక్కించారు. అక్కడి నుంచి విశాఖపట్నం జూకు గున్న ఏనుగును తరలించేందుకు చర్యలు చేపట్టారు. ముందే....ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టిఉంటే...?. అటవీశాఖాధికారులు మందే ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టి ఉంటే పెద్ద ఏనుగు మృతిచెంది ఉండేది కాదని స్థానికులు అభిపాయపడ్డారు. గత నెల 7వ తేదీన ఒడిశా రాష్ట్రం బొలంగీర్ ప్రాంతం నుంచి సాలూరు మండలం కొట్టుపరువు గ్రామంలోకి ప్రవేశించిన రెండు ఏనుగులు నెలరోజులుగా మక్కువ, సాలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించాయి. ఈ నెల 11వ తేదీన గాదిపల్లివలస గ్రామం సమీపంలోని అరటితోట వద్ద విద్యుత్‌వైర్లు తగలడంతో పెద్ద ఏనుగు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆపరేషన్ గజను చేపట్టిన అధికారులు గున్న ఏనుగును పట్టుకోగలిగారు. కార్యక్రమంలో అడిషనల్ సీసీఎఫ్ ప్రదీప్‌కుమార్, విజయనగరం డీఎఫ్ఓ ఐకేవీ రాజు, శ్రీకాకుళం డీఎఫ్ఓ బి.విజయకుమార్, విశాఖపట్నం స్క్వాడ్ డీఎఫ్ఓ బి.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో ’ఆపరేషన్గజ’