ఆపరేషన్ వికటించి మహిళ మృతి
Published Sun, Oct 27 2013 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
పిఠాపురం, న్యూస్‌లైన్ : కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స వికటించడంతో తన భార్య మరణించినట్టు ఆమె భర్త పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం పట్టణంలోని మంగయ్యమ్మరావు పేటకు చెందిన కూరగాయల శివపార్వతికి గతనెల 29న ఓ పాప పుట్టింది. అనంతరం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఈనెల 22న ఆమెకు స్థానిక వైద్యుడు బాలాజీ శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను గురువారం తిరిగి పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆమె పరిస్థితి విషమం గా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొం దుతూ ఆమె శనివారం మరణించింది. స్థానిక వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక పేగుకు బదులు మరో దానికి ఆపరేషన్ చేయడం వల్లే తన భార్య చనిపోయిందని రాజు పిఠాపురం టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement