వరంగల్, న్యూస్‌లైన్: ఒక్కో ఇంజినీరు సగటు వేతనం రూ.40 వేలు. ఇలా జిల్లాలోని భారీ నీటిపారుదల శాఖలో మొత్తం 84 మంది ఇంజినీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రతి నెలా రూ. 33.60 లక్షల వేతనాలు ఇస్తోంది. ప్రభుత్వ వాహనాల్లో అలా వచ్చి, రిజిస్టర్లలో ఇలా సంతకాలు పెట్టి పోతున్నా... అటు భూసేకరణ కాకపోవడం, ఇటు పనులు ఆగిపోరుు ఏడాదిన్నరగా పనిలేక ఖాళీగా ఉంటున్నా... సర్కారు చోద్యం చూస్తూ కాలం వెళ్లదీస్తోంది. పైగా... సైట్‌కు వెళ్తున్నామంటూ డీఏ, వాహనాల ఖర్చు పేరిట సదరు ఇంజినీర్లు డ్రా చేసుకుంటున్నా... ప్రజల సొమ్మే కదా అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంతటి సువర్ణావకాశం ఉద్యోగులకు ఎక్కడైనా దొరుకుతుందనుకుంటే పొరపాటే. అందుకేనేమో మరి... వరంగల్ సర్కిల్ నుంచి వెళ్లాలంటే ఇరిగేషన్ ఇంజినీర్లకు మనసొప్పుత లేదు. ఇటీవల ఓ ఎస్‌ఈ స్థాయి అధికారి మరో ప్రాజెక్ట్‌కు బదిలీ అయినా... ఓ మంత్రి పైరవీతో మళ్లీ ఇక్కడే పోస్టింగ్ వేయించుకున్నాడు.
పని లేని విధుల్లో 84 మంది...
దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణం పనులు మొదటి నుంచి మూడో దశ వరకూ ఏడాదిన్నరగా వివిధ కారణాలతో నిలిచిపోరుున విషయం తెలిసిందే. ధరలు పెంచడం లేదని... భూసేకరణ సాగుతలేదంటూ కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో ఇంజినీర్లకు పనిలేకుండా పోరుుంది. ఈ ప్రాజెక్ట్ పేరు మీద క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్ విభాగం ఇంజినీర్లు, కార్యాలయ సిబ్బంది పోనూ అక్షరాల 84 మంది ఫీల్డ్ ఇంజినీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దేవాదుల చీఫ్ ఇంజినీర్ (సీఈ) సర్కిల్ పరిధిలో ఒక సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) ఉన్నారు. ఈ సర్కిల్‌లో నాలుగు డివిజన్ కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఈఈలున్నారు. ఒక్కో ఈఈ పరిధిలో నాలుగు సబ్ డివిజన్ కార్యాలయూలున్నారుు. ఈ మేరకు ఒక్కో ఈఈ పరిధిలో నలుగురు డీఈల చొప్పున మొత్తం 16 మంది పనిచేస్తున్నారు. ఇక ఒక్కో డీఈ పరిధిలో నలుగురు ఏఈల చొప్పున 64 మందిఉన్నారు. ఇలా మొత్తం 84 మంది ఫీల్డ్ ఇంజినీర్లు ఏడాదిన్నరగా పనిలేని విధులు నిర్వర్తిస్తుండడం విశేషం.
డీఏలు.. అలవెన్సులూ...
భూ సేకరణ, కోర్టు వ్యవహారాల విషయాల్లో సీఈ, ఎస్‌ఈలు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డివిజన్-1కు కంతనపల్లి పనులు కట్టబెట్టినా... అవి ఇంకా మొదలుకాలేదు. భూ సేకరణపై సంబంధిత అధికారులు ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. అంటే దేవాదుల సర్కిల్ పరిధిలోని ఈఈ నుంచి ఏఈ స్థాయి వరకు ఇంజినీర్లు ఇప్పటివరకు ఉత్తుత్తి విధులు నిర్వర్తించారన్న మాట. ఎక్కడా పనులు జరగకున్నా.... కేటాయించిన వాహనాల్లో దర్జాగా తిరుగుతూ డీఏలు, ఇతర అలవెన్సులు పొందడం గమనార్హం.
సర్కారు నిర్లక్ష్యం
ఇంజినీర్లకు ప్రతి నెలా రూ. 33.60 లక్షల వేతనాలు, రూ.7 లక్షలకుపైగా అలవెన్సులు ఇస్తున్న ప్రభుత్వం... వారికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. పనులు సాగకపోవడంతో ఇంజినీర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిని ఇతర ప్రాంతాలకు గానీ... భారీ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు గానీ పంపించకపోవడం పర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. అరుుతే ఇక్కడి ఇంజినీర్లకు డిప్యూటేషన్ వేసినా... వెళ్లడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇటీవల ఓ ఎస్‌ఈని ఇక్కడినుంచి హైదరాబాద్ కార్యాలయానికి బదిలీ చేస్తే... పంతం పట్టి ఇక్కడే క్వాలిటీ కంట్రోల్ విభాగానికి తిరిగి బదిలీ చేయించుకున్నాడు. అంటే పని లేని విధులు నిర్వర్తించడం ఇంజినీర్లకు కూడా అలవాటైనట్లు ఈ ఉదంతం నిరూపిస్తోంది.
అనుభవించు రాజా!
Published Fri, Jan 17 2014 6:20 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement