
మోడల్ జిల్లా మన లక్ష్యం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామికం రంగాలతోపాటు ఇతర రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తారని, ఈ యజ్ఞంలో జిల్లా ప్రజలు, సంస్థలు పాలుపంచుకోవాలని కోరారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తొలుత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథం లో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని మంత్రి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన మన జిల్లాలోనే ఎందరో త్యాగధనులు స్వాతంత్య్ర సముపార్జనలో అవిరళ కృషి చే శారని కొనియాడారు.
సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోం దని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు అం శాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖ ల మధ్య సమన్వయం పెంపొం దించేందుకు ఏడు ప్రాధాన్యతా అంశాలతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు.
445 గ్రామాల్లో ‘సుజల స్రవంతి’
గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు అందించేందుకు, ప్రజలను రోగాల బారినుంచి రక్షిం చేందుకు జిల్లాలోని 445 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేయనున్నట్టు మం త్రి మాణిక్యాలరావు చెప్పారు. ఈ పథకం కింద 20 లీటర్ల నీటిని రూ.2కే అందిస్తామన్నారు.
ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు
వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలి పారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నిటినీ ధ్యాన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఆలయ భూముల పరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అక్టోబర్ నుంచి పింఛను మెుత్తాల పెపు
జిల్లాలో వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పిం ఛను మెుత్తాలను అక్టోబర్ 2నుంచి పెంచుతున్నట్టు మంత్రి తెలిపారు. అక్టోబర్ 2నుంచే 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం జిల్లాలో రూ.122 కోట్ల వ్యయంతో 159 కొత్త లైన్లను అభివృద్ది చేసినట్టు చెప్పారు. రూ.151 కోట్లతో ట్రాన్స్‌ఫ్మారర్లు, కండక్టర్లు, కేబుల్స్ సమకూర్చేందుకు అనుమతులు వచ్చాయని వివరించారు. దీంతో గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుందన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, నగర మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, డీఐజీ పి.హరికుమార్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, జిల్లా మొదటి అదన పు జడ్జి వై. లక్ష్మణరావు, డిస్ట్రిక్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కె.శివాచార్యులు, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బి.రమణ, ఇరిగేషన్ ఎస్‌ఈ డి.తిరుమలరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కె.వేణుగోపాల్, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ పులి శ్రీనివాసులు, డీఈవో నరసింహరావు, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె. జ్ఞానేశ్వరరావు, ఉద్యాన శాఖ ఏడీ ఎన్.సుజాత, గనుల శాఖ ఏడీ వైఎస్ బాబు పాల్గొన్నారు.