పచ్చనోటు.. అక్రమాలకు రూటు | Paccanotu irregularities in the root .. | Sakshi
Sakshi News home page

పచ్చనోటు.. అక్రమాలకు రూటు

Published Sun, Nov 2 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

పచ్చనోటు.. అక్రమాలకు రూటు

పచ్చనోటు.. అక్రమాలకు రూటు

సాక్షి,గుంటూరు
 రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ల్లో అధికారుల ధనదాహం కారణంగా అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో సరిహద్దు చెక్‌పోస్టులు రెండింటిని ఏర్పాటు చేశారు. ఒకటి నాగార్జునసాగర్, మరొకటి పొందుగల వద్ద ఉంది.

  ఇక్కడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ క్యాష్ కొట్టిన వాహనాన్ని చెక్ చేయకుండా పంపివేయడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  ఇక్కడ జరుగుతున్న దందా ఉన్నతాధికారులకు తెలియనీయకుండా  కొందరు సిబ్బంది తమదైన శైలిలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

  రాత్రివేళ వారి ఆగడాలకు హద్దు లేకుండా పోతోందని, దొరికిన కాడికి దోచెయ్ అన్న చందంగా విధులు నిర్వహిస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  ఒక వేళ ఇక్కడి తంతు అధికారుల దృష్టికి వెళ్లినా, వారు స్పందించేలోపు వాహనాలు రాష్ట్రం దాటి వెళుతున్నాయి.

 అసలు లక్ష్యం ఇది...
  దాచేపల్లి మండలం పొందుగల, నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్ వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల్లో రవాణా, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖలకు చెందిన సిబ్బందిని వాహనాల తనిఖీ కోసం నియమించారు. ఆయా వాహనాల రికార్డులను తనిఖీ చేయడంతో పాటు వాహనంలో వున్న సరకు కూడా పరిశీలించాల్సి వుంది.

   అనుమానం వున్న వాహనాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించాలి. మితిమీరిన లోడుతో వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేయాలి.

  ప్రభుత్వ పన్నుల వసూలు చేపట్టాలి. అలాగే రాత్రింబవళ్లు పటిష్ట నిఘా కొనసాగిస్తూ సమర్థంగా విధులు నిర్వహించాల్సి వుంది.

   దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీలు, మన జిల్లా నుంచి తరలివెళ్లే బియ్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్ట వచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం.
 సరిహద్దులు దాటుతున్న బియ్యం, ఇసుక బియ్యం, ఇసుక అక్రమ రవాణా వ్యాపారులు, జీరో బిల్ వ్యాపారులు సరిహద్దు చెక్‌పోస్ట్‌లను తమ అక్రమాలకు అడ్డాలుగా మలచుకుంటున్నారు.

  అక్కడ ఎవరు విధుల్లో వున్నారు. అనే సమాచారాన్ని ముందుగానే సేకరిస్తున్నారు. వారికి అనుకూలమైన వ్యక్తులు వుంటే చాలు. వెంటనే వారి వాహ నాలను హడావుడిగా చెక్‌పోస్ట్‌లను దాటిస్తున్నారు.

  నిమిషాల వ్యవధిలో బియ్యం, ఇసుక, వంటివి రాష్ట్ర సరిహద్దులు దాటి బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. అక్రమ సరకుతో ఉన్న లారీని చెక్‌పోస్ట్ దాటించినందుకు ప్రతిగా వేలల్లో నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం.

  భారీ వాహనాలు మితి మీరిన లోడుతో వచ్చినా కేసులు నమోదు చేయకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయకుండా అక్కడి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వాహనాల డ్రైవర్లు బహిరంగంగానే చెబుతున్నారు.

 సరిహద్దు చెక్‌పోస్ట్‌లపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు జిల్లా నుంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న బియ్యం,ఇసుక తదితర వాటిని పట్టుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement