
'రేవంత్ విషయం.. ఏపీకి సంబంధించి కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. ముడుపుల కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడాన్ని విలేకరులు ప్రస్తవించగా.. పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానం దాటవేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం కాదని చెప్పారు. సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం సుధీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యవహారం చర్చకు వచ్చినట్టు సమాచారం. కేబినెట్ సమావేశనాంతరం పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.