- ఏప్రిల్ 15 లోగా నిర్వహించాల్సిందే
- హైకోర్టు ఆదేశం
- భీమిలి మున్సిపాలిటీ విలీనంపైనా సందేహాలు?
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో విలీనం కాకుండా నిలుపుదల చేసిన భీమునిపట్నం మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలకు వెంట నే ఎన్నికలు నిర్వహించాలని హైకో ర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భీమునిపట్నం మండల పరిధిలోని కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయగా, ఆ జీవోను హైకోర్టు రద్దు చేసింది. అయినా కూడా ఈ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించకపోవడంతో మత్య్సకారులు వై.అప్పలకొండ, మరికొం దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది.
మునిసిపల్ ఎన్నికల వల్ల తమపై ఎంతో భారం ఉందని కమిషన్ తెలి పింది. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండ గా లేని భారం, ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకని ప్రశ్నించా రు. ఈ ఐదు పంచాయతీలు వెంటనే ఎన్నికలు పెట్టాలని, మొత్తం ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
భీమిలి విలీనంపైనా సందేహాలు?
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీలో భీ మిలి విలీనంపై సందేహాలు ముసురుకున్నా యి. నిబంధనల మేరకు కొనసాగింపు లేకుం డా ప్రాంతాలను కార్పొరేషన్లో విలీనం చేసేం దుకు వీల్లేదు. భీమిలి-జీవీఎంసీ మధ్య ఈ ఐదు పంచాయతీలున్నాయి. వీటి విలీనం రద్దుతో.. జీవీఎంసీకి, భీమిలి మున్సి పాలిటీ మధ్య లింకు తెగనుంది. అలాంటపు డు జీవీఎంసీలోకి భీమిలిని విలీనం చేయడం కుదిరేది కాదని అధికారులే చెప్తున్నారు. మేయర్‌ను జనరల్ కేటగిరీగా ప్రకటించిన ఎన్నికల సంఘం, వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాల్సి ఉంది.