ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి | panchayat secretary caught taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Published Thu, Apr 23 2015 6:03 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

panchayat secretary caught taking bribe

విజయవాడ : పత్రాల్లో పేరు మార్చడానికి లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు పంచాయతి పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గత మూడేళ్లుగా కోడూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మత్స్య సరోజిని.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు సంబంధించిన పత్రాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో ఆ మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సరోజిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement