ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో భారీవర్షాలు, వరదల కారణంగా ఈనెల 8న జరగాల్సిన 30 పంచాయతీ ఎన్నికల్లో 25 పంచాయతీలకు వాయిదా పడ్డాయి. గత నెల మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో 18 మండలాల్లోని 30 పంచాయతీలు, 318 వార్డులలో వర్షాలు, వరదల కారణంగా ఎన్నికలను మొదట ఆగస్టు 8కి వాయిదా వేశారు. సోమవారం నుంచి జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తుండడం, వరదల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగడంతో ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఉండటంతో 25 పంచాయతీలు, 257 వార్డుల ఎన్నికలు వాయిదా వేశారు. భీమిని మండలం లక్ష్మాపూర్, సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి, ఉట్పూర్ మండలంలోని ఉట్నూర్, కడెం మండలం లోని ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలో ని ఇటిక్యాల సర్పంచ్ స్థానాలకు, వీటి పరిధిలోని 60 వార్డులలో ఎన్నికలు జరుగు తాయని కలెక్టర్ ఏ.బాబు తెలిపారు.
వాయిదా పడ్డ పంచాయతీలు ఇవే..
ఆదిలాబాద్ డివిజన్‌లోని బేల మండలం సాంగ్వి-జి, బోథ్ మండలంలోని బాబేర, కరత్వాడ, బజార్‌హత్నూర్ మండలంలోని గిర్నూర్, ఆదిలాబాద్ మండలంలోని యా పల్‌గూడ, మంచిర్యాల డివిజన్‌లోని వేమనపల్లి మండలంలోని చామన్‌పల్లి, ధస్నాపూర్, ఆసిఫాబాద్ డివిజన్‌లోని సిర్పూర్-టి మండలం దబ్బా, కౌటాల మండలంలోని బాబాసాగర్, గుడ్లబోరి, గంగాపూర్, బెజ్జూరు మండలంలోని దిమ్డా, కుశ్నపల్లి, పాపన్నపేట్, పెంచికల్‌పేట్, ఔట్ సారంగపల్లి, కాగజ్‌నగర్ మండలంలోని బారేగూడ, మాలిని, పోతపల్లి, వంజారి, ఆసిఫాబాద్ మండలంలోని మోవడ్, ఉట్నూర్ డివిజన్‌లోని నార్నూర్ మండలంలోని గాదిగూడ, పరస్‌వాడ-బి, వాంకిడి మండలంలోని కన్నెరగావ్, తిర్యాణి మండలంలోని మంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతోపాటు ఆయా గ్రామ పంచాయతీల్లోని 257 వార్డుల్లో ఎన్నికలతోపాటు మంగి గ్రామ పంచాయతీలోని నంబర్ 3లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
25 పంచాయతీలకు 13న ఎన్నికలు
Published Wed, Aug 7 2013 4:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement