కూతురుకు వేధింపులు.. తాట తీసిన తల్లి! | Parents Beat Auto Driver Who Molested 10th Student In West Godavari | Sakshi
Sakshi News home page

కూతురుకు వేధింపులు.. తాట తీసిన తల్లి!

Published Tue, Mar 17 2020 1:37 PM | Last Updated on Thu, Sep 30 2021 7:18 PM

Parents Beat Auto Driver Who Molested 10th Student In West Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమగోదావరి: తన కూతురును వేధిస్తున్న ఆటోడ్రైవర్‌ను ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన పాలకేడేరు మండలం విస్సాకోడేరులో మంగళవారం వెలుగుచూసింది. జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని భోరుమంది. దీంతో వారు సదరు ఆటోడ్రైవర్‌ను పాఠశాలకు లాక్కొచ్చి  చితకబాదారు. విద్యార్థిని తల్లి నిందితుడికి దేహశుద్ధి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఆటో డ్రైవర్‌ను పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement