పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం
హైకోర్టు సీనియర్ న్యాయవాది,
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు
తెనాలి : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా ఉన్నాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు శివనాగేశ్వరరావు అన్నారు. మాతృవియోగం కారణంగా తెనాలిలో ఉన్న శివనాగేశ్వరరావును బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారని గుర్తు చేస్తూ, ఏపీలో 67 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు అభివృద్ధి, సంక్షేమ నిధులను విడుదల చేయొద్దని ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.
దురదృష్టకరం : డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెడుతూ కొందరు ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు చూడటం దురదృష్టకరమన్నారు. ప్రలోభాలకులోనై పార్టీలు మారినవారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. జిల్లాలో తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాల్సిన పని లేదన్నారు. పార్టీ నేతలు పెరికల కాంతారావు, గుంటూరు కృష్ణ, గాదె శివరామకృష్ణారెడ్డి ఉన్నారు.