పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలి | The Party Should Work As A Force For Strengthening Like Soldiers | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలి

Published Sat, Jun 23 2018 11:26 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

The Party Should Work As A Force For Strengthening Like Soldiers - Sakshi

పరీక్షిత్‌రాజుతో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అరకులోయ సమన్వకర్త చెట్టి పాల్గుణ, పార్టీ నేతలు 

సాక్షి, అనంతగిరి (అరకులోయ) : మన్య ప్రాంతంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ బూత్‌ కమిటీల బాధ్యతలపై అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుతో అరకులోయ సమన్వయకర్త చెట్టి పాల్గుణ చర్చించారు.  శుక్రవారం కురుపాం నియోజకవర్గంలోని  పరీక్షిత్‌రాజును ఆయన గృహంలో పార్టీ నాయకులతో కలిశారు.  పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయాలని పరీక్షిత్‌రాజు సూచించారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. మన్య ప్రాంతంలో ఉన్న పలు సమస్యలపై వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు ఎత్తిచూపాలని అన్నారు. పార్టీ నాయకులను అభినందించారు.

అనంతరం కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు కొర్రా గాశీ, గెమ్మెల కొండబాబు, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, డుంబ్రిగుడ మాజీ ఎంపీపీ సాయిబాబ, ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డి. ఆనంద్‌ కుమార్, జిల్లా ఎస్టీ సెల్‌ కార్యదర్శి బాకూరి సదాశివరాజు, అరకు పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవేరి కొండలరావు, వైస్‌ ఎంపీపీ ధర్మనాయుడు, అరకు మండల  ప్రధాన కార్యదర్శులు రమేష్, గెన్ను, డుంబ్రిగుడ మండల కార్యదర్శి విజయదస్మి, మహిళ నాయకురాలు కోడ సుçహాసిని తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement